
బిగ్ బాస్ 3 షోపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. లైంగిక వేధింపులకు అడ్డాగా మారిన బిగ్ బాస్ 3 షో ను నిలిపివేయాలని ఓయూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఓయూ స్టూడెంట్స్ తో కలిసి యాంకర్ శ్వేతారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. బిగ్ బాస్ 3 షో కు హోస్ట్ గా చేస్తున్న హీరో నాగార్జున వెంటనే తప్పుకోవాలని డిమాండ్ చేశారు.బిగ్ బాస్ 3 షో పై ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిగ్ బాస్ షో నిర్వాహకులు..శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తాలకు క్షమాపణ చెప్పాలన్నారు. తెలంగాణ లో బిగ్ బాస్ షో నిర్వహించకూడదన్నారు. రేపు మరోసారి అన్నపూర్ణ స్టూడియోను ముట్టడిస్తామని చెప్పారు. బిగ్ బాస్ షో బ్యాన్ చేయాలని అన్నారు.