
మెహిదీపట్నం, వెలుగు: వీకెండ్ నైట్స్ మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామని పబ్లిక్‌లో అపోహ ఉందని, దీనిని తొలగించేందుకు ఇకపై అన్ని జంక్షన్లలో ఏ సమయంలోనైనా చెకింగ్ చేపడతామని ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రాందాస్ తేజావత్ తెలిపారు. గురువారం టోలిచౌకిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
జంట నగరాల పరిధిలో ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమయంలోనైనా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. మద్యం సేవించి బండ్లు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ ఏసీపీ ధనలక్ష్మి, టోలిచౌకి, కులుసుంపుర, గోషామహల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, అంజయ్య, సైదులు, శోభన్ బాబు పాల్గొన్నారు.