స్విగ్గీ ఫ్లాట్ ఫాం ఛార్జీల బాదుడు.. ప్రతి ఆర్డర్ పై రూ.2 వసూలు

స్విగ్గీ ఫ్లాట్ ఫాం ఛార్జీల బాదుడు.. ప్రతి ఆర్డర్ పై రూ.2 వసూలు

ఆన్‌లైన్ దిగ్గజ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గి కార్ట్ తన కస్టమర్స్ కి షాకిచ్చింది. ఆర్డర్ వ్యాల్యూతో సంబంధం లేకుండా రూ. 2 “ప్లాట్‌ఫారమ్ ఫీజు” వసూలు చేయనుంది. అయితే.. స్విగ్గి ప్రధాన ప్లాట్‌ఫారమ్‌లోని చేసే ఫుడ్ ఆర్డర్‌లపై మాత్రమే ఈ అదనపు ఛార్జీలు విధించబడుతున్నామని, ఇన్‌స్టామార్ట్ నుండి చేసే వినియోగదారులకు ఈ చార్జెస్ వర్తించవని కంపెనీ తెలిపింది.

ఇక ఈ చార్జెస్ కూడా.. తమ ప్లాట్‌ఫారమ్‌ను ఆపరేట్ చేయడానికి, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెయింటైన్ చేయడానికి, యాప్ ఫీచర్‌లను మెరుగుపరచడానికి మాత్రమే వినియోగిస్తామని” స్విగ్గీ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

Swiggy రోజుకి 1.5 నుండి 2 మిలియన్ ఆర్డర్‌లను ప్రాసెస్ చేస్తున్నామని, హైదరాబాద్‌ ప్రజలు రంజాన్ పండుగ సందర్భంగా స్విగ్గీలో 10 లక్షల బిర్యానీలు, 4 లక్షల ప్లేట్ల హలీమ్‌లను ఆర్డర్ చేశారని తెలిపారు. గడిచిన 12 నెలల్లో స్విగ్గి  33 మిలియన్ ప్లేట్ల ఇడ్లీలను డెలివరీ చేసిందని, ఈ డిష్‌కు కస్టమర్‌లలో అపారమైన ఆదరణ ఉందని సూచించింది.