ఏం తినాలో స్విగ్గీ చెబుతుంది

ఏం తినాలో స్విగ్గీ చెబుతుంది

న్యూఢిల్లీ: ఆన్​లైన్​ ఫుడ్​ డెలివరీ ప్లాట్​ఫారమ్​స్విగ్గీ ‘వాట్​ టూ ఈట్’ పేరుతో కొత్త ఫీచర్​ను తీసుకొచ్చింది. ప్రతి కస్టమర్​కు నచ్చే ఆహారాన్ని ఇదే సెలెక్ట్​ చేసి పెడుతుంది. కస్టమర్​ మూడ్​, లొకేషన్​, ఆర్డర్ ​హిస్టరీ​, టైమ్​, ఇతర ప్రిఫరెన్సుల ఆధారంగా కావాల్సిన ఆహార పదార్థాలను సూచిస్తుంది. 

యాప్​లోని మూడ్​బబుల్స్​ ఆధారంగా యూజర్లు కూడా నచ్చిన ఫుడ్​ను ఎంచుకోవచ్చు. లోకల్​ట్రెండ్స్​, పాపులారిటీ ఆధారంగానూ రికమెండేషన్లు ఇస్తామని స్విగ్గీ తెలిపింది. ప్రతి ఆర్డర్​కు పది రికమండేషన్లు వస్తాయి.