2050 నాటికి 5 లక్షల జాబ్స్

V6 Velugu Posted on Jul 31, 2021

  • మొత్తం ఉద్యోగాల సంఖ్య 14 లక్షలకు చేరిక
  •  ప్రపంచవ్యాప్తంగా 80 లక్షల కొలువులు

న్యూఢిల్లీ: పర్యావరణానికి మేలు చేసే సోలార్, విండ్ వంటి క్లీన్ఎనర్జీలకు మారితే ఇండియాలో 2050 నాటికి ఐదు లక్షల జాబ్స్ అందుబాటులోకి వస్తాయని తాజా స్టడీ ఒకటి వెల్లడించింది. అయితే ప్రస్తుతం మనదేశంలో సోలార్‌‌ ఎనర్జీ తయారీ చాలా తక్కువగా ఉంది. బొగ్గు,పెట్రోలియం ప్రొడక్టుల వాడకమే ఎక్కువ. అంతేకాదు ఈ రెండు సెక్టార్లు దాదాపు 8.6 లక్షల మందికి జాబ్స్ ఇచ్చాయి. క్లీన్ఎనర్జీకి మారితే 2050 నాటికి అదనంగా మన దేశంలో 5.4 లక్షల జాబ్స్​ వస్తాయి.  అదే గ్లోబల్​గానైతే 80 లక్షల మందికి జాబ్స్ వస్తాయి. వన్ ఎర్త్ జర్నల్‌‌లో ‘‘క్లైమేట్‌‌ యాక్షన్‌‌ రిజల్ట్స్‌‌ ఇన్‌‌ మోర్‌‌జాబ్స్‌‌’’ పేరుతో రాసిన రీసెర్చ్‌‌ పేపర్‌‌లో డాక్టర్ సందీప్ పాయ్ ఈ వివరాలు వెల్లడించారు.  పారిస్ ఒప్పందం ప్రకారం.. టెంపరేచర్లు  రెండు డిగ్రీల కంటే తక్కువగానే కొనసాగితే భారతదేశ ఇంధన రంగంలో ఉద్యోగాల సంఖ్య 2050 నాటికి 8.6 లక్షల నుండి 14 లక్షలకు  పెరుగుతుంది. మిగిలిన దక్షిణ ఆసియా దేశాల్లో 69 వేల జాబ్స్ వస్తాయి. అయితే చైనా 27 లక్షల జాబ్స్ కోల్పోతుందని ఈ స్టడీ వెల్లడించింది. ఎందుకంటే డ్రాగన్ దేశం భారీగా థర్మల్ కరెంటు తయారు చేస్తోంది. అమెరికా, మిడిల్ ఈస్ట్,  ఉత్తర ఆఫ్రికాలో 10 లక్షల మందికిపైగా ఉపాధి దొరుకుతుందని పాయ్ అన్నారు.  జనాభాతోపాటు జీడీపీ, పట్టణీకరణ పెరగడం వల్ల సోలార్ పవర్‌‌కు డిమాండ్ ఎక్కువ అవుతుందని ఆయన వివరించారు. 50 దేశాల నుంచి వివరాలు సేకరించడం ద్వారా ఈ రిపోర్టును తయారు చేశామని పాయ్ చెప్పారు.  ‘‘ప్రపంచమంతటా తయారవుతున్న థర్మల్‌‌ పవర్‌‌లో చైనా వాటా 5-0 శాతం వరకు ఉంది. ఇండియాలో కోల్‌‌సెక్టార్‌‌లో ఐదు లక్షల మంది మాత్రమే పనిచేస్తున్నారు. కోల్‌‌ నుంచి కరెంటు తయారీ ఆగిపోతే చైనాలో 60 లక్షల మంది జాబ్స్‌‌కు దూరమవుతారు. అక్కడ క్లీన్‌‌ఎనర్జీ ఇండస్ట్రీలు వచ్చినా ఉద్యోగ నష్టాన్ని భర్తీ చేయడం సాధ్యం కాదు. మరో 27 లక్షల మందికి జాబ్స్‌‌ దొరకడం కష్టమవుతుంది. ఇండియాలో అలా కాదు. పోయే జాబ్స్‌‌ కంటే కొత్తగా వచ్చేవే ఎక్కువ ఉంటాయి’’ అని ఆయన వివరించారు.

రూ.5 వేల కోట్లతో భారీ సోలార్ ప్లాంట్  ప్రకటించిన ఫస్ట్ సోలార్

న్యూఢిల్లీ: ఇండియాలో రూ.ఐదు వేల కోట్ల పెట్టుబడితో సోలార్ ప్లాంటు పెడతామని అమెరికాకు చెందిన ఫస్ట్‌‌ సోలార్‌‌ ఇన్‌‌కార్పొరేషన్‌‌ ప్రకటించింది. ఇక్కడ ఫొటోవోల్టోయిక్ సోలార్ మాడ్యూల్స్ తయారు చేస్తారు. ప్లాంటు కోసం ఇండియా ప్రభుత్వం అనుమతులు వస్తున్నాయని తెలిపింది. ప్లాంటు కోసం ఆఫర్ చేసిన ప్రోత్సాహకాలు కూడా తమకు నచ్చాయని కంపెనీ పేర్కొంది. 2023 సంవత్సరం జూన్‌‌ తరువాత ప్లాంటు కార్యకలాపాలు మొదలవుతాయి. అయితే ప్లాంటు లొకేషన్‌‌ వివరాలను కంపెనీ బయటపెట్టలేదు. "భారతదేశం మాకు ఆకర్షణీయమైన మార్కెట్. ఇక్కడి టెంపరేచర్లతో సోలార్ పవర్‌‌ కు ఎంతో అనుకూలం. మా మాడ్యూల్ టెక్నాలజీ భారీగా తయారు చేయవచ్చు. ఇండియాలో క్లీన్ ఎనర్జీకి డిమాండ్ పెరగబోతోంది.  ప్రతి సంవత్సరం 25 గిగావాట్ల కంటే ఎక్కువ సోలార్‌‌ పవర్‌‌ ఉత్పత్తి చేస్తాం.  చైనా సి–ఎస్ఐ సప్లై చెయిన్లపై ఆధారపడకుండానే మాడ్యూల్స్ తయారు చేస్తాం”అని ఫస్ట్ సోలార్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ విడ్మార్ అన్నారు. ఈ ఫెసిలిటీకి 3.3 గిగావాట్ల  కెపాసిటీ ఉంటుందని అంచనా.

Tagged study, 2050, Switchi, renewable energy , 5 lakh jobs

Latest Videos

Subscribe Now

More News