యూఎస్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో ఫైనల్లోకి స్వైటెక్‌‌‌‌

యూఎస్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో ఫైనల్లోకి స్వైటెక్‌‌‌‌

న్యూయార్క్‌‌‌‌‌‌‌‌‌‌: అంచనాలకు తగ్గట్టుగా ఆడిన పోలెండ్‌‌‌‌ టాప్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌, వరల్డ్‌‌‌‌ నంబర్‌‌‌‌వన్‌‌‌‌ ఇగా స్వైటెక్‌‌‌‌.. యూఎస్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం అర్ధరాత్రి జరిగిన విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ సెమీస్‌‌‌‌లో టాప్‌‌‌‌సీడ్‌‌‌‌ స్వైటెక్‌‌‌‌ 3–6, 6–1, 6–4తో ఆరోసీడ్‌‌‌‌ అరినా సబలెంకా (బెలారస్‌‌‌‌)పై గెలిచింది. 2 గంటలా 11 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌‌‌‌లో పోలెండ్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ తొలి సెట్‌‌‌‌ను చేజార్చుకుంది. కానీ తర్వాతి రెండు సెట్లలో తనదైన ఆటతీరుతో సబలెంకాకు చెక్‌‌‌‌ పెట్టింది. స్టార్టింగ్‌‌‌‌లోనే సబలెంకా సర్వీస్‌‌‌‌లను బ్రేక్‌‌‌‌ చేసిన స్వైటెక్‌‌‌‌ 4–1 లీడ్‌‌‌‌లో నిలిచింది. తర్వాత తన సర్వ్‌‌‌‌లను కాపాడుకుంటూ ఈజీగా సెట్‌‌‌‌ను గెలిచి మ్యాచ్‌‌‌‌లో నిలిచింది. నిర్ణయాత్మక మూడో సెట్‌‌‌‌లో సబలెంకా 4–2 ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ స్వైటెక్‌‌‌‌ ధాటికి ఏడో గేమ్‌‌‌‌లో సర్వ్‌‌‌‌ను కోల్పోవడంతో స్కోరు 4–4తో సమమైంది. ఈ దశలో స్వైటెక్‌‌‌‌ ఫోర్‌‌‌‌హ్యాండ్‌‌‌‌ షాట్లతో బెలారస్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ను కట్టడి చేస్తూ సెట్‌‌‌‌తో పాటు మ్యాచ్‌‌‌‌ను సొంతం చేసుకుంది.

మరో సెమీస్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో ఐదోసీడ్‌‌‌‌ ఆన్స్‌‌‌‌ జుబేర్‌‌‌‌ (ట్యూనీషియా) 6–1, 6–3తో కరోలిన్‌‌‌‌ గార్సియా (ఫ్రాన్స్‌‌‌‌)పై నెగ్గింది. గంటా 6 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌‌‌‌లో జుబేర్‌‌‌‌ 8, గార్సియా రెండు ఏస్‌‌‌‌లు కొట్టారు. జుబేర్‌‌‌‌ రెండు డబుల్‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌ చేసినా, 15 అనవసర తప్పిదాలతోనే సరిపెట్టుకుంది. వచ్చిన నాలుగు బ్రేక్‌‌‌‌ పాయింట్లను కాపాడుకుని విన్నర్‌‌‌‌గా నిలిచింది. 23 అనవసర తప్పిదాలు చేసిన గార్సియా ఒక్క బ్రేక్‌‌‌‌ పాయింట్‌‌‌‌ను కూడా సాధించలేదు. ఇద్దరి మధ్య శనివారం రాత్రి ఫైనల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ జరుగుతుంది.