స్విట్జర్లాండ్​కు భారతీయుల క్యూ

స్విట్జర్లాండ్​కు భారతీయుల క్యూ

హైదరాబాద్​, వెలుగు: తమ దేశాన్ని గత ఏడాది ఆరు లక్షల మందికిపైగా భారతీయులు  సందర్శించారని, వీటిలో తెలుగు రాష్ట్రాల వాటా 4.8 శాతం ఉందని -స్విట్జర్లాండ్ టూరిజం బోర్డు వెల్లడించింది. హైదరాబాద్​నగరం టాప్​–8 ప్లేసులో ఉందని తెలిపింది. అయితే కరోనాకు ముందు ఏటా తొమ్మిది లక్షల మంది భారతీయులు తమ దేశానికి వచ్చే వారని తెలిపింది.  

అన్ని సీజన్లలోనూ భారతీయ పర్యాటకులు వస్తున్నారని సంస్థ ఈస్ట్ మార్కెట్స్ చీఫ్ మార్కెట్స్ ఆఫీసర్ సైమన్ బోషా​ చెప్పారు.  పర్యాటకుల కోసం పర్యావరణ అనుకూల ఇన్ ఫ్రాస్ట్రక్చర్​ను అందుబాటులోకి తెచ్చామని అన్నారు.