- వార్డు మెంబర్ క్యాండిడేట్లకు 20 గుర్తులు
- ఎంపిక చేసిన ఎన్నికల సంఘం.. జిల్లాలకు చేరిన బ్యాలెట్ పేపర్లు
మెదక్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అటు అభ్యర్థులతోపాటు ఇటు పబ్లిక్‌ను ఎక్కువగా ఆకట్టుకునేవి గుర్తులే! ఎంపీటీసీ మొదలు ఎంపీ ఎన్నికల దాకా అన్నీ పార్టీ గుర్తులపైనే జరుగుతాయి. ఆయా ఎలక్షన్లలో ఇండిపెండెంట్లకు ఇతర గుర్తులు కేటాయించినా వాటిపై పెద్దగా ఆసక్తి ఉండదు. కానీ పార్టీలకతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో అందరి దృష్టి సింబల్స్‌పైనే ఉంటుంది.
ఆయా గుర్తులను ఎన్నికల సంఘం ఎంపిక చేస్తుంది. జనం వాడుకలో ఉన్నవి, అందరికీ తెలిసినవి, దృష్టిలోపం ఉన్న వృద్ధులు , ఇతరులు సైతం గుర్తుపట్టేలా ఉన్నవాటిని ఆచితూచి ఎంపిక చేస్తుంది. ఎప్పటికప్పుడు వీటిలో కొన్ని గుర్తులను మారుస్తూ ఉంటుంది. తాజాగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికలకు మొత్తం 50 రకాల గుర్తులను ఎన్నికల సంఘం ఎంపిక చేసింది.
సర్పంచ్ అభ్యర్థులకు 30, వార్డు మెంబర్ క్యాండిడేట్లకు 20 సింబల్స్‌ను కేటాయించింది. సర్పంచ్అభ్యర్థుల బ్యాలెట్ పేపర్ పింక్ కలర్‌లో, వార్డ్ మెంబర్ బ్యాలెట్ పేపర్ వైట్ కలర్‌లో ఉంటాయి. కాగా, ఇప్పటికే ముద్రించిన బ్యాలెట్ పేపర్లు జిల్లాలకు చేరుకున్నాయి.
సర్పంచ్ అభ్యర్థుల గుర్తులు ఇవే..
రింగు, కత్తెర, బ్యాట్, ఫుట్‌బాల్, లేడీస్ పర్స్, టీవీ రిమోట్, టూత్ పేస్ట్, స్పానర్, చెత్త డబ్బా, బ్లాక్ బోర్డు, బెండకాయ, కొబ్బరి తోట, వజ్రం, బకెట్, డోర్ హ్యాండిల్, టీ జల్లెడ, చేతి కర్ర, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, బ్యాట్స్‌మెన్, పడవ, బిస్కెట్, ఫ్లూట్, చైన్, చెప్పులు, బెలూన్, స్టంప్స్.
వార్డు మెంబర్ అభ్యర్థుల గుర్తులు..
గౌన్, గ్యాస్ పొయ్యి, స్టూల్, గ్యాస్ సిలిండర్, బీరువా, ఈల, కుండ, డిష్ యాంటీనా, గరాట, మూకుడు, ఐస్‌క్రీం, గాజు గ్లాసు, పోస్టు డబ్బా, ఎన్వలప్ కవర్, హాకీ స్టిక్, బాల్, నెక్ టై, కటింగ్ ప్లేయర్, పెట్టె, విద్యుత్ స్తంభం, కేటిల్.
