ఆల్కహాల్‌, సిగరెట్ల బానిసలు ఈ సమస్యలతో బాధపడుతుంటే

ఆల్కహాల్‌, సిగరెట్ల బానిసలు ఈ సమస్యలతో బాధపడుతుంటే

ఆల్కహాల్‌, సిగరెట్లకు బానిసలైన వాళ్లకు, అవి ఉన్నట్టుండి దొరక్కపోతే ‘విత్‌డ్రాయల్‌ సింప్టమ్స్’ కనిపిస్తా యి. లాక్‌డౌన్ కారణంగా కొన్ని రోజులుగా ఈ లక్షణాలతో బాధపడుతూ, ఆసుపత్రుల్లో చేరుతున్న వాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే ఈ సమస్యను దాటగలగడం అసాధ్యమేమీ కాదంటున్నారు నిపుణులు.

రెగ్యులర్‌‌గా తీసుకునే ఆల్కహాల్‌‌, నికోటిన్‌‌ల పరిమాణం, బాధితుల బయలాజికల్‌ ‌అంశాల ఆధారంగా లక్షణాలుంటాయి.కాళ్లు చేతులు వణకడం, తలనొప్పి, జీర్ణ సమస్యలు, వాంతులు, చెమట, వికారం, తిమ్మిర్లు వంటిశారీరక లక్షణాలు, మతిమరుపు, మూర్ఛ, డిప్రెషన్‌‌, యాంగ్జైటీ, చిరాకు, నిద్రపట్టక పోవడం వంటి మానసిక లక్షణాలు కనిపిస్తాయి. ఏ సమస్యలున్నా డాక్టర్‌ను కలవాలి. వీటితో దూరం ఆల్కహాల్‌‌, నికోటిన్‌ వంటి డ్రగ్స్‌ దొరక్కుండా ఇబ్బంది పడుతున్న వాళ్లవ్వరైనా హ్యాపీగా, హెల్దీగా ఉండాలంటే ఈపద్ధతుల్ని పాటించాలని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.

 చూయింగ్‌‌ గమ్‌

సిగరెట్‌ మానేసేందుకు ఇది చాలాఈజీ మెథడ్‌‌. మెడికల్‌‌షాపుల్లో దొరికే నికోటిన్‌ చూయింగ్‌ గమ్స్‌ రెగ్యు లర్‌‌గా వాడితే,స్మోక్‌ చేయాలన్న ఆలోచన చాలావరకు తగ్గుతుంది. చూయింగ్‌ గమ్స్‌ మాత్రమే కాకుండా, కొన్ని రకాలలా జెంజెస్‌‌, క్రంచెస్‌ ‌వంటివి దొరుకుతున్నాయి. వీటిని నోట్లో వేసుకుని చప్పరిస్తే, మెల్లిగా పొగతాగే అలవాటు దూరమవుతుంది.

 బ్రెయిన్‌‌ గేమ్స్‌‌ మందు

సిగరెట్‌ ‌తాగాలనే ఆలోచన వచ్చేది మెదడునుంచే. అందుకే మెదడుకు పని చెప్పే పనులు చేస్తే, ఇలాంటి ఆలోచనలనుంచి బయటపడొచ్చు. ఇందుకోసం సుడోకు, క్రాస్‌‌వర్డ్స్‌, పజిల్స్‌ వంటి బ్రెయిన్‌‌గేమ్స్‌ఆడితే కొంత ఫలితం ఉంటుంది.

ఆర్ట్‌‌ థెరపీ

ఏదైనాఒక క్రియేటివ్‌ ‌ఆర్ట్స్ తో  ప్రాక్టీస్‌‌ క్టీ చేయడం ద్వారా‘విత్‌‌డ్రాయల్‌‌సింప్టమ్స్‌ ’రాకుండా చూసుకోవచ్చని ఎక్స్ పర్ట్స్ సూచిస్తున్నారు. డిప్రెషన్‌‌,మానసిక సమస్యలతో బాధపడుతున్న వాళ్లెందరి జీవితాల్లోనో క్రియేటివ్‌ ‌ఆర్ట్‌ మార్పు తీసుకొచ్చింది.

 ఫ్రెండ్స్‌‌, ఫ్యామిలీ సాయం మందు

సిగరెట్‌‌దొరక్కపోవడం వల్ల ప్రవర్తనలో ఎక్కువ మార్పులు వచ్చాయనిపిస్తే వెంటనే కుటుంబ సభ్యులు లేదా ఫ్రెండ్స్‌హెల్ప్‌ తీసుకోవాలి.వాళ్ల సహకారంతో కౌన్సెలర్‌‌, డాక్టర్‌ను కలిసి సరైన ట్రీట్‌‌మెంట్‌ ‌తీసుకోవాలి. మరిన్ని టెక్నిక్స్‌‌ ఈపరిస్థి తిని ఎదుర్కొనేందుకు ఇంకొన్నిటెక్నిక్స్‌‌కూడా ఫాలోఅవ్వొచ్చు. సెల్ఫ్‌‌– హిప్నోసిస్‌ను రోజూ కనీసం పది నిమిషాలు ప్రాక్టీస్‌‌ చేయాలి.అలాగే మెడిటేషన్‌‌, చక్రాస్‌‌ ప్రాక్టీస్‌‌ చేసినా ఫలితం ఉంటుంది.