అహ్మదాబాద్ లో మళ్లీ బయటపడ్డ బర్డ్ ఫ్లూ లక్షణాలు

అహ్మదాబాద్ లో మళ్లీ బయటపడ్డ బర్డ్ ఫ్లూ లక్షణాలు

గుజరాత్ : అహ్మదాబాద్ లో మళ్లీ బర్డ్ ఫ్లూ లక్షణాలు బయటపడ్డాయి. ఆకృతి టౌన్ షిప్ ఏరియాలో రెండు రోజుల్లో 190 పావురాలు చనిపోయాయి. దీంతో గుజరాత్ పశు సంవర్ధక శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఆకృతి టౌన్ షిప్ ను డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారి పరిశీలించారు. చనిపోయిన పావురాలన్నింటిని పాతిపెట్టారు. కొన్నింటి నుంచి శాంపిల్స్ తీసి టెస్టుల కోసం పంపించారు. వాటి రిజల్ట్ ఇంకా రావాల్సి ఉంది. అయితే బర్డ్ ఫ్లూ ప్రోటోకాల్ ఇష్యూ చేసినట్టు అధికారులు తెలిపారు.