హైదరాబాద్​లో సింజెంటా సీడ్ టెస్ట్​ ల్యాబ్​

హైదరాబాద్​లో సింజెంటా సీడ్ టెస్ట్​ ల్యాబ్​

హైదరాబాద్​, వెలుగు: గ్లోబల్ అగ్రికల్చర్ కంపెనీ సింజెంటా దాదాపు రూ. 20 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్​ సమీపంలోని నూతనకల్​ గ్రామంలో విత్తన పరీక్ష ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించింది.

ఈ ల్యాబ్ ప్రపంచంలోని అత్యంత అధునాతన విత్తన పరీక్షా సౌకర్యాలలో ఒకటని సింజెటా తెలిపింది.  భారతదేశంతోపాటు ఆసియా పసిఫిక్ ప్రాంతం  వెలుపల ఉన్న విత్తన పెంపకందారులకు సేవలను అందిస్తుంది. అధిక- నాణ్యత, ఆరోగ్యకరమైన విత్తనాల తయారీకి సాయపడుతుంది.