
హైదరాబాద్: తెలంగాణ యువకుడికి ఒమన్ దేశంలో మంచి అవకాశం వచ్చింది. ఇవాళ్టి నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభమవుతుండగా.. ఫస్ట్ మ్యాచ్ ఒమన్..పపువా న్యూ గినియాతో జరుగుతుంది. అయితే ఒమన్ టీమ్ లో మన హైదరాబాద్ యువకుడు సెలక్ట్ అయ్యాడు. కవాడిగూడకు చెందిన శ్రీమంతుల సందీప్ గౌడ్ ఒమన్ టీమ్ కు సెలక్ట్ అయ్యాడుని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. 29 ఏళ్ల సందీప్..2005-08 మద్య హైదరాబాద్ అండర్-15,19 టీమ్స్ లో ఆడాడు. అయితే 2016 జాబ్ కోసం ఒమన్ కు వెళ్లి అక్కడే సెటిల్ అయ్యాడు. అనుకోకుండా ఒమన్ దేశవాళీ మ్యాచుల్లో ఆడే అవకాశం రావడంతో సందీప్ సత్తా చాటి, నేషనల్ టీమ్ కు ఆడే అవకాశం అందుకున్నాడు. ఆదివారం మధ్యాహ్నం 3-30 గంటలకు ఒమన్.. పపువా న్యూ గినియాతో జరిగే మ్యాచ్ లో సందీప్ ఆడనున్నాడు.