
ముంబై: టీ20 క్రికెట్ వరల్డ్‌కప్ ఆతిథ్యంపై ఐసీసీకి క్లారిటీ ఇచ్చేందుకు గడువు (జూన్ 28) దగ్గరపడుతున్న వేళ ఈ అంశంపై బీసీసీఐ నుంచి కీలక ప్రకటన వచ్చింది. అక్టోబర్–నవంబర్‌లో ఇండియాలో జ రగాల్సిన మెగా టోర్నీ యూఏఈకు తరలి వెళ్లడం దాదాపుగా ఖాయమైంది. బీసీసీఐ సెక్రటరీ జైషా ఈ విషయాన్ని శనివారం వెల్లడించారు. ‘మన దేశంలో కరోనా పరిస్థితి దృష్ట్యా టీ20 వరల్డ్‌కప్‌ను యూఏఈ తరలించే ఆలోచనలో ఉన్నాం. పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాం. ప్లేయర్ల ఆరోగ్యం, భద్రత కంటే మాకు ఏదీ ముఖ్యం కాదు. టోర్నీ ఆతిథ్యంపై అతి త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటాం’ అని జైషా ప్రకటించారు. యూఏఈ, ఒమన్ వేదికలుగా ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ జరిగే అవకాశముందని ఇదివరకే బీసీసీఐ వర్గాలు లీకులిచ్చాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ ఈవెంట్ కూడా అరబ్గడ్డలో జరగడం ఖాయమైతే.. ఫారిన్ ప్లేయర్ల అంశంలో ఫ్రాంచైజీలకున్న టెన్షన్ తగ్గనుంది.