సౌతాఫ్రికాతో ఇండియా సూపర్‌‌‌‌–8 మ్యాచ్‌‌.. సఫారీలతో అంత ఈజీ కాదు.. మన బ్యాటింగ్‌ ‌‌‌‌‌‌‌పైనే టెన్షన్‌‌‌‌‌‌‌‌

సౌతాఫ్రికాతో ఇండియా సూపర్‌‌‌‌–8 మ్యాచ్‌‌.. సఫారీలతో అంత ఈజీ కాదు.. మన బ్యాటింగ్‌ ‌‌‌‌‌‌‌పైనే టెన్షన్‌‌‌‌‌‌‌‌

ఆడిన నాలుగు మ్యాచ్‌‌ల్లోనూ గెలిచి  టీ20 వరల్డ్‌‌ కప్  లీగ్ దశను ముగించిన టీమిండియా.. ఆదివారం జరిగే సూపర్ –8 రౌండ్ గ్రూప్‌‌–1 మ్యాచ్‌‌లో బలమైన సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. గ్రూప్ దశలో సౌతాఫ్రికా కూడా నాలుగు విజయాలతో అజేయంగా నిలిచింది.

అహ్మదాబాద్: ఆడిన నాలుగు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లోనూ గెలిచి  టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్  లీగ్ దశను అజేయంగా ముగించిన ఆతిథ్య టీమిండియా మెగా టోర్నీలో అసలు సిసలు సవాల్‌‌‌‌‌‌‌‌కు సిద్ధమైంది. ఆదివారం జరిగే సూపర్ –8 రౌండ్ గ్రూప్‌‌‌‌‌‌‌‌–1 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో బలమైన సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేస్తూ క్రీజులో పాతుకుపోయే  విధానాన్ని అనుసరిస్తున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ వ్యూహాలకు ఈ మ్యాచ్ అగ్నిపరీక్ష కానుంది. ఎందుకంటే గత ఎడిషన్ ఫైనల్లో ఇండియా చేతిలో ఓడి రన్నరప్‌‌‌‌‌‌‌‌గా నిలిచిన సఫారీ టీమ్ ఈసారి సూపర్ పెర్ఫామెన్స్ చేస్తోంది. లీగ్ దశలో ఆ టీమ్ కూడా నాలుగు విజయాలతో అజేయంగా నిలిచింది. మరి గత ఫైనల్ పోరు ఫలితాన్ని ఇండియా రిపీట్ చేస్తుందా? లేక ఆ ఓటమికి మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రమ్ సేన ప్రతీకారం తీర్చుకుంటుందా? చూడాలి.

బ్యాటింగ్‌ ‌‌‌‌‌‌‌పైనే టెన్షన్‌‌‌‌‌‌‌‌
గ్రూప్ దశలో 4 విజయాలు సాధించినప్పటికీ ఇండియా బ్యాటింగ్ విభాగం ఆశించిన స్థాయిలో  లేదు. టాప్-4 బ్యాటర్లలో ఓపెనర్ ఇషాన్ కిషన్ మాత్రమే స్థాయికి తగ్గట్టు రాణిస్తున్నాడు. రెండు ఫిఫ్టీ లు కొట్టి 202 స్ట్రయిక్  రేట్‌‌‌‌‌‌‌‌తో అద్భుతమైన ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాడు. మరో యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆడిన మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లోనూ సున్నా చుట్టాడు. వరుసగా ఫెయిలవుతున్నప్పటికీ తనపై టీమ్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ ఉంచిన నమ్మకాన్ని అభి ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో అయినా నిలబెట్టుకుంటాడేమో చూడాలి.  ఇక,  స్పిన్‌‌‌‌‌‌‌‌కు అనుకూలిస్తున్న స్లో వికెట్లపై కెప్టెన్‌‌‌‌‌‌‌‌ సూర్యకుమార్ (136), తిలక్ వర్మ (120)  స్ట్రయిక్ రేట్‌‌‌‌‌‌‌‌పై విమర్శలు వస్తున్నాయి. పాక్, నమీబియా, నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌పై తిలక్ చాలా స్లోగా ఆడాడు.

అమెరికాతో తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో మెరుపు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ ఆడిన తర్వాత  సూర్య కూడా అంతగా ఫామ్‌‌‌‌‌‌‌‌లో లేడు. ఇద్దరు కీలక బ్యాటర్లు స్వేచ్ఛగా రన్స్‌‌‌‌‌‌‌‌ రాబట్టకపోవడంతో మిగతా వాళ్లపై ఒత్తిడి పడుతోంది. కాబట్టి తిలక్, సూర్య బ్యాట్లు ఝుళిపించాల్సి ఉంది. మిడిలార్డర్ తడబడుతున్నా డెత్ ఓవర్లలో హార్దిక్ పాండ్యా (155 స్ట్రయిక్ రేట్), శివం దూబే (178 స్ట్రయిక్ రేట్) విధ్వంసకర బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌తో  గ్రూప్‌‌‌‌‌‌‌‌ దశలో ఇండియా అజేయంగా నిలిచింది. ఇక, బుమ్రా నేతృత్వంలోని బౌలింగ్ విభాగం జట్టును ఫేవరెట్‌‌‌‌‌‌‌‌గా నిలుపుతోంది. బుమ్రా,  స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వేసే 8 ఓవర్లు మ్యాచ్‌‌‌‌‌‌‌‌లను శాసిస్తున్నాయి. సఫారీలపైనా ఈ ఇద్దరూ కీలకం కానున్నారు. అయితే, సౌతాఫ్రికా బలమైన బ్యాటింగ్ లైనప్‌‌‌‌‌‌‌‌ను ఎదుర్కోవాలంటే మొత్తం బౌలింగ్ యూనిట్ సమష్టిగా రాణించాల్సి ఉంటుంది. గత మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో రెస్ట్ తీసుకున్న స్పిన్నర్లు కుల్దీప్‌‌‌‌‌‌‌‌, అక్షర్ తిరిగి తుది జట్టులోకి వచ్చే చాన్సుంది.

సఫారీలతో అంత ఈజీ కాదు
సఫారీ టీమ్ అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తోంది. డికాక్, మార్‌‌‌‌‌‌‌‌క్రమ్, బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్, రికెల్టన్, మిల్లర్, యాన్సెన్ వంటి మ్యాచ్ విన్నర్లతో బ్యాటింగ్ లైనప్ చాలా ప్రమాదకరంగా ఉంది.  కగిసో రబాడ, ఎంగిడి, యాన్సెన్ లాంటి వరల్డ్ క్లాస్‌‌‌‌‌‌‌‌ పేసర్లు, స్పిన్నర్ కేశవ్ మహారాజ్ తో కూడినఈ భీకరమైన బౌలింగ్ లైనప్‌‌‌‌‌‌‌‌ను ఎదుర్కోవడం ఇండియా బ్యాటర్లకు అంత సులువు కాదు.  ఇక, గత రెండు నెలల వ్యవధిలో ఈ రెండు జట్లు ముఖాముఖి తలపడటం ఇది ఆరోసారి. ప్లేయర్ల మధ్య పరిచయం, ఒకరి బలాలు బలహీనతలు మరొకరికి తెలిసి ఉండటం ఏ జట్టుకు అనుకూలిస్తుందో చూడాలి. 

పిచ్‌‌‌‌‌‌‌‌/వాతావరణం
ఈ మ్యాచ్ నల్ల మట్టి  పిచ్‌‌‌‌‌‌‌‌పై జరగనుంది. ఈ వికెట్‌‌‌‌‌‌‌‌పై బాల్‌‌‌‌‌‌‌‌ కాస్త నెమ్మదిగా బ్యాట్‌‌‌‌‌‌‌‌పైకి వచ్చే అవకాశం ఉంది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయి. మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు వాన ముప్పు లేకపోయినా.. మంచు ప్రభావం ఉండనుంది.  దాంతో టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్‌‌‌‌‌‌‌‌కు మొగ్గు చూపొచ్చు.

తుది జట్లు (అంచనా)

ఇండియా: అభిషేక్, ఇషాన్ (కీపర్), తిలక్ , సూర్యకుమార్ (కెప్టెన్), హార్దిక్ , రింకూ ,  దూబే, అక్షర్, కుల్దీప్ యాదవ్/ అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్ సింగ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి.

సౌతాఫ్రికా: మార్‌‌‌‌‌‌‌‌క్రమ్ (కెప్టెన్), డికాక్ (కీపర్),  రికెల్టన్, బ్రెవిస్, స్టబ్స్, మిల్లర్, యాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్, రబాడ/అన్రిచ్, ఎంగిడి.