దాయాదుల పోరు..టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్

దాయాదుల పోరు..టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్

ఉత్కంఠ టీ ట్వంటీ పోరులో టాస్ గెలిచింది పాకిస్థాన్. టాస్ గెలిచిన పాక్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇండియన్ టీంలో రోహిత్ శర్మ, రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్, పాండ్యా, జడేజా, భువనేశ్వర్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, బూమ్రా ఉన్నారు. అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్ లో టీమిండియా పటిష్టంగా ఉంది. వరల్డ్ కప్ మ్యాచుల్లో పాకిస్థాన్ తో జరిగిన ప్రతీ మ్యాచ్ లో టీమిండియాదే పై చేయిగా ఉంది. ఇప్పటి వరకు పాక్ తో 12 మ్యాచ్ లు ఆడగా అన్నింటిలో భారత్ గెలిచింది.

ఉదయం నుంచి పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు అభిమానులు. భారత్ గెలవాలంటూ.. ప్లేయర్స్ కు మద్దతుగా దేశమంతా ర్యాలీలు జరిగాయి. సెలబ్రిటీల నుంచి మొదలుకుని సామాన్యుడి వరకు మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. మ్యాచ్ ను ప్రత్యేకంగా చూసేందుకు ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసుకున్నారు. స్టేడియంల నుంచి అపార్ట్ మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీల్లో బిగ్ స్క్రిన్స్ రెడీ అయిపోయాయి. 

దాదాపు రెండేళ్ల తర్వాత దాయాదుల పోరు జరుగుతోంది. 2019 వాల్డ్ కప్ లో తలపడ్డాయి రెండు దేశాలు. ఆ మ్యాచ్ లో ఇండియానే గెలిచింది. ఇక T-20 వాల్డ్ కప్ లో భారత్ – పాక్ లు 5సార్లు తలపడితే..  అన్ని మ్యాచుల్లోనూ ఇండియానే గెలిచింది. రెండుజట్లలో భారత్ టీం చాలా బలంగా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇండియా టీం పర్ ఫెక్ట్ గా కనబడుతోంది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ లతో బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే బూమ్రా, షమీ, రవీంద్ర జడేజాలు మంచి ఫాంలో ఉన్నారు. భువనేశ్వర్, శార్ధూల్ ఠాకూర్ లలో ఒకరికి అవకాశం దక్కొచ్చు. స్పిన్ విషయంలో అశ్విన్, వరుణ్ చక్రవర్తిలో ఒకరికి చాన్స్ ఉండొచ్చు. రెండు టీంలకు దుబాయ్ పిచ్ లు బాగా అలవాటే. 

ఇక పాకిస్థాన్ విషయానికొస్తే బ్యాటింగ్ లైనప్ బలంగా కనబడుతోంది. ఓపెనర్ రిజ్వాన్, కెప్టెన్ అజామ్ లు మంచి ఫాంలో ఉన్నారు. వీళ్లకు తోడు జమాన్ కూడా బ్యాటింగ్ లో సత్తా చూపిస్తున్నాడు. బౌలింగ్ విషయానికొస్తే అఫ్రిది, రవుఫ్, షాదాబ్ ఖాన్, వసీంలు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు.