నేను అంత చీప్ కాదు.. కంగనపై తాప్సీ ఫైర్

V6 Velugu Posted on Mar 06, 2021

ముంబై: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కామెంట్లపై మరో హీరోయిన్ తాప్సీ ఫైర్ అయ్యింది. చీప్, చవక అంటూ తనపై కంగన చేసిన వ్యాఖ్యల మీద తాప్సీ మండిపడింది. ప్యారిస్‌‌లో తాను బంగ్లా కొనడాన్ని వివాదాస్పదం చేస్తున్నారని.. సమ్మర్ హాలీడేస్ కోసం దాన్ని ఖరీదు చేశానని ట్వీట్ చేసింది. ఆ బంగ్లా విలువ రూ.5 కోట్లని తెలిపింది. 2013లో తనపై జరిగిన ఇన్‌కమ్ ట్యాక్స్ దాడులు అప్పటి ఆర్థిక మంత్రికి తెలిసే జరిగాయని స్పష్టం చేసింది. కంగన తనను సస్తీ, చీప్ అంటూ అనడంపై స్పందించిన తాప్సీ.. ఇక తాను ఎంతమాత్రం చవక కాదని వ్యంగ్యంగా జవాబిచ్చింది. తాప్సీతోపాటు ప్రముఖ హిందీ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్‌‌పై ఐటీ శాఖ దాడులు చేసిన విషయం తెలిసిందే.

Tagged Actor kangana ranaut, IT raids, Anurag Kashyap, Bunglow, Actor Taapsee Pannu, sasti

Latest Videos

Subscribe Now

More News