కార్యకర్త పాడె మోసిన ఎమ్మెల్యే

కార్యకర్త పాడె మోసిన ఎమ్మెల్యే

తాడ్వాయి, వెలుగు: తాడ్వాయి మండలం కాంగ్రెస్ పార్టీ యూత్ ఉపాధ్యక్షుడు సతీశ్‌ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం దేవయపల్లి గ్రామంలో సతీశ్ అంత్యక్రియల్లో ఎమ్మెల్యే మదన్‌ మోహన్ పాల్గొని సతీశ్ పాడె మోశాడు. సతీశ్‌ రెండు రోజుల కింద ఆర్థిక ఇబ్బందులతో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం  చేశాడు. హైదరాబాద్‌లో ఓ హాస్పిటల్‌కు తరలించగా.. విషయం తెలుసుకున్న  ఎమ్మెల్యే మదన్​మోహన్ హాస్పిటల్ బిల్లు రూ.40 వేలు ఆర్థిక సాయం  అందించాడు. కాగా చికిత్స పొందుతూ సతీశ్‌ ప్రాణాలు కోల్పోయాడు. 

మృతుడి అంత్యక్రియల్లో ఎమ్మెల్యే సతీశ్‌ స్వయంగా పాల్గొన్నారు. ఆయనతోపాటు మండలాధ్యక్షుడు వెంకటరెడ్డి, యూత్ అధ్యక్షుడు అఖిల్‌రావు, కాంగ్రెస్ లీడర్లు జక్కుల రాజిరెడ్డి, శ్యామ్‌రావు, శివాజీ, మేకల రాజు, షౌకత్ పాల్గొన్నారు