గోనెపల్లి గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి తీర్మానం : సర్పంచ్ గడ్డం నాగభూషణం

గోనెపల్లి గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి తీర్మానం : సర్పంచ్ గడ్డం నాగభూషణం
  •     సర్పంచ్ గడ్డం నాగభూషణం

తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలం గోనెపల్లి గ్రామంలో సర్పంచ్ గడ్డం నాగభూషణం ఆధ్వర్యంలో సంపూర్ణ మద్యపానాన్ని నిషేధిస్తూ గ్రామస్తులు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం  సర్పంచ్​ గడ్డం నాగభూషణం ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు.  గ్రామంలో ఎవరైనా మద్యం, మత్తు పానీయాలు అమ్మితే వారికి ప్రభుత్వ పథకాలు , రేషన్ బియ్యంపై ఆంక్షలు విధిస్తామని  తీర్మానంలో పేర్కొన్నారు. 

ఈ నిబంధనలు అతిక్రమించిన వారిని ప్రభుత్వ అధికారులకు తెలియజేసి వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చేస్తామని అన్నారు. అనంతరం  గ్రామంలో మద్య పానాన్ని మత్తు పదార్థాలను పూర్తిగా నిషేధిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వార్డు మెంబర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.