- తహసీల్దార్‌పై మంత్రి పొంగులేటికి ఫిర్యాదు
- కలెక్టర్ ఆదేశాలతో విచారణ జరిపిన అధికారులు
సూర్యాపేట, వెలుగు: ధరణిలో లోపాలను అడ్డుపెట్టుకొని తహసీల్దార్ఏకంగా రికార్డులను తారుమారు చేసి, భూమిని ఇతరులకు పట్టా చేశారు. అలా ఎలా చేస్తారని అడిగితే ఎంక్వైరీ పేరుతో బాధితులను ఇబ్బందులు పెట్టారు. చివరకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో ఈ అక్రమ పట్టా వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. ఆత్మకూరు(ఎస్) మండలం శెట్టిపాలెంకు చెందిన స్వామి రాజ్యలక్ష్మి గ్రామంలోని సర్వే నంబర్ 105లో ఉన్న 2.12 ఎకరాల భూమిని 20 ఏళ్ల క్రితం కాకి రేణుక నుంచి కొనుగోలు చేసింది. అధికారులు రికార్డుల్లో రాజ్యలక్ష్మి పేరు నమోదు చేశారు. పొజిషన్ కూడా ఆమె పేరుతోనే ఉంది. ధరణిలో మాత్రం ఇప్పటికీ కాకి రేణుక పేరే కొనసాగుతోంది.
పట్టా పాస్ పుస్తకం కోసం రాజ్యలక్ష్మి పలుమార్లు అప్లికేషన్ పెట్టుకున్నా రాలేదు. ఇటీవల తహసీల్దార్తహసీల్దార్ఆఫీస్కు వెళ్లిన ఆమెకు మరో షాక్ తగిలింది. గత నెల 25న తహసీల్దార్అమీన్సింగ్ ఆ భూమిని కాకి అరుణ కుమార్తె పేరుమీద పట్టా మార్పు చేశారని తెలుసుకుంది. ఆ విషయమై తహసీల్దార్‌ను ప్రశ్నించగా.. ఎంక్వైరీ చేస్తామంటూ బాధితురాలిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
తనకు జరిగిన అన్యాయం పై ఆమె ఈ నెల 1న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేయగా.. ఆయన వెంటనే కలెక్టర్ తేజస్నంద్లాల్పవార్కు ఫోన్ చేసి విచారణ జరపాలని ఆదేశించారు. దీంతో కలెక్టర్సూర్యాపేట ఆర్డీవో వేణుమాధవరావును ఎంక్వైరీ ఆఫీసర్ గా నియమించారు. విచారణలో ఆర్ఐ , సర్వేయర్ ఇచ్చిన రిపోర్టులు రాజ్యలక్ష్మికి అనుకూలంగా ఉన్నప్పటికీ పడావు భూమి అని రిపోర్ట్ మార్చి, కాకి రేణుకకు అనుకూలంగా పట్టా చేశారని తేలింది. తాజాగా ఆ నివేదికను ఆర్డీవో కలెక్టర్ కు అందించారు.
