తైవాన్ దేశంలో చిత్ర, విచిత్రమైన దేవుళ్లు.. లవ్, బ్రేకప్, ఛాయ్ ఆలయాలు

తైవాన్ దేశంలో చిత్ర, విచిత్రమైన దేవుళ్లు.. లవ్, బ్రేకప్, ఛాయ్ ఆలయాలు

తోడు కోసం డేటింగ్ యాప్లను ఆశ్రయిస్తున్న రోజులివి. కానీ, అక్కడి ప్రజలు ఇంకా పాత పద్ధతులను పాటిస్తున్నారు. ప్రేమ ఫలించాలని, మంచి భార్య రావాలని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ.. ప్రేమ దేవుడ్ని పూజిస్తున్నారు. ఈ లవ్ గాడ్ గురించి, అదే ప్రాంతంలో ఉన్న మరో రెండు విచిత్రమైన దేవాలయాల గురించి ఓ లుక్కేద్దాం...

తైవాన్ రాజధాని తైపీకి నలభై కిలో మీటర్ల దూరంలో గాడ్ సిటీ(దేవుళ్ల నగరం) 'క్సియా ''హాయ్' ఉంది. విచిత్రమైన దేవుళ్ల గుడిలు ఈ ప్రాంతంలో కనిపిస్తాయి. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది లవ్ గాడ్ గురించి. ఈయన్ని ఇక్కడి ప్రజలు 'యూయీ లావో అని కూడా పిలు స్తారు. చైనా పురాణాల ప్రకారం.. యూ ఈ లావో ఓ సన్యాసి. చంద్రవంక కింద కొలువై ఉండే ఈ దేవుడు ఎవరికి ఎలాంటి భార్య రావాలన్నది ని ర్ణయిస్తాడని, తన దగ్గర ఉండే పుస్తకంలో ఆ విష యాన్ని పేర్కొంటాడని ప్రశస్తి. అందుకే ప్రేమలు ఫలించాలని, మంచి భార్య దొరకాలని జనాలు ఈ దేవుడ్ని మొక్కుకుంటారు. 

ఆరో శతాబ్దంలో ట్యాంగ్ రాజ్యానికి చెందిన ఓ వ్యక్తి ఈ ఆలయాని కి వచ్చాడు. కానీ, లవ్ గాడ్ను అతను నమ్మకుం డా ఇష్టపడ్డ అమ్మాయిపై దాడి చేస్తాడు. కొంత కాలం తర్వాత అతనికి పెళ్ళి అవుతుంది. అతని భార్య కూడా ప్రేమోన్మాది చేతిలో గాయపడిన బాపతే అని అతనికి తెలుస్తుంది. వెంటనే ప్రాయ శ్చిత్తం చేయమని యూయీ లావోను వేడుకుని ఆ వ్యక్తి ముడుపు కట్టాడు. అప్పటి నుంచి ఈ 'మ్యాచ్మకర్' దేవుడ్ని భక్తులను బాగా విశ్వసి 'మ్యాచ్ మేకర్' దేవుడ్ని భక్తులను బాగా విశ్వసి స్తున్నారు. వేల ఏండ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని 1912లో స్థానికులు పునర్మించారు. అప్పటి నుంచి ప్రేమ-పెళ్లిళ్ల దేవుడిని విదేశీ జంటలు కూడా సందర్శించుకుంటున్నారు.

బ్రేకప్ దేవుడు..

ఇదే క్సియా హాయ్ నగరంలో బ్రేకప్ దేవుడి గుడి కూడా ఉంది. ఆ ఆలయం పేరు ఝినాన్.. అందులో ఉన్న దేవుడి పేరు లూ డోంగ్-బింగ్. ఈయన ఓ కవి. ఏ కాలానికి చెందినవాడన్న విషయంపై స్పష్టత లేదు. అయితే ఒంటరి వాడైన ఆయనకు అమ్మాయిల వ్యామోహం ఎక్కువని, జంటలను చూస్తే ఆయన కుళ్లుకుంటాడని జంటలను చూస్తే ఆయన కుళ్లుకుంటాడని ఇక్కడి పురాణంలో పేర్కొని ఉంది. అందుకే జంటలు ఈ ఆలయాన్ని సందర్శించరు. కాదని వెళ్తే వాళ్లను ఈ దేవుడు కచ్చితంగా విడగొడతా డని నమ్ముతారు.

చాయ్ గుడి..

క్సియా హాయ్ నగరం శివారులో దాదావోచెంగ్ అనే గుడి ఉంటుంది. ఒకప్పుడు టీ వ్యాపారాని కి ప్రముఖ కేంద్రంగా ఉండేది. దాదావోచెంగ్ అనే వ్యక్తి టీ వ్యాపారంలో సంపాదించిందంతా జనాల కోసం ఖర్చు చేశాడని.. అతనికి గుర్తుగా ఓ ఆలయాన్ని కూడా కట్టించారు. అయితే ఈ గుడిలో అతని విగ్రహం మాత్రం ఉండదు. టీ ఎస్టేట్లో పని చేసే పనివాళ్ల నమునా చిత్రాలు మాత్రమే కనిపిస్తాయి. ఈ ప్రాంతంపై నెట్ ఫ్లిక్స్ ఆ మధ్య 'ఏ తైవానీస్ టేల్ ఆఫ్ టూ సిటీస్' పేరిట ఓ సిరీస్ ను రూపొందించింది.