
జూబ్లీహిల్స్, వెలుగు : మాజీ సీఎం కేసీఆర్పై కొన్ని న్యూస్ చానెల్స్ దుష్ప్రచారం చేస్తున్నాయని బీఆర్ఎస్నేతలు శుక్రవారం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, పంజాగుట్ట పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. లిక్కర్స్కామ్కేసులో ఈడీ కేసీఆర్పేరును ప్రస్తావించినట్లు ఇటీవల 16 న్యూస్చానెల్స్ కథనాలు ప్రచారం చేశాయని పేర్కొన్నారు.
ఆయా మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసినవారిలో బంజారాహిల్స్డివిజన్బీఆర్ఎస్ కో-ఆర్డినేటర్ రాజు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఇతర నాయకులుఉన్నారు.