ఎండల్లో జుట్టుపై జాగ్రత్తలు పాటించండి

V6 Velugu Posted on Mar 01, 2021

మిగిలిన కాలాలతో పోలిస్తే ఎండాకాలంలో జుట్టు  సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఈ సీజన్‌లో  వేడుకలూ చాలానే ఉంటాయి. ఎండలకు జుట్టు చిట్లిపోవడం, పొడిబారడం వల్ల వెంట్రుకలు నిర్జీవంగా మారతాయి. దీంతో పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్లినప్పుడు జుట్టు కళ తప్పుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సమ్మర్ టైంలో ఎక్కువగా చెమట పడుతుంది. దీనివల్లే రకరకాల హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వెంట్రుకలు మరింత జిడ్డుగా, డ్రై జుట్టు ఇంకాస్త పొడిగా, నిర్జీవంగా మారతాయి. జుట్టు  చిట్లిపోతుంది. వెంట్రుకల్లో చెమట వల్ల స్కాల్ప్​పై  చుండ్రు ఏర్పడి జుట్టు రాలిపోతుందా? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.

తలస్నానం

ప్రతిరోజు ఎండలో తిరుగుతున్నా.. వారానికి ఒకసారి మాత్రమే తలస్నానం చేస్తుంటారు చాలామంది. కానీ, కాలుష్యం వల్ల  జుట్టులో పేరుకుపోయిన  మురికిని, కాలుష్య కారకాలను తొలగించాలంటే  వారానికి రెండుమూడు సార్లు తలస్నానం చేయాలంటున్నారు ఎక్స్‌‌పర్ట్స్. స్నానం చేసే అరగంట ముందు తలకు కొబ్బరి నూనె పట్టించి తలస్నానం చేయాలి. అయితే, నాణ్యమైన షాంపూలనే ఎంచుకోవాలి. అప్పుడే జుట్టులో తేమ కోల్పోకుండా జుట్టు చివర్లు చిట్లకుండా ఉంటాయి.
తరచూ చేయొద్దు

కొందరు  పదే పదే తలస్నానం  చేస్తుంటారు. ఇది కూడా ప్రమాదమే. ఇలా చేయడం వల్ల తల్లో ఉండే సహజమైన నూనెలు ఆవిరవుతాయి.  దాంతో వెంట్రుకలు పొడిబారి జుట్టు పీచులా  మారుతుంది.  తరచూ షాంపూతో తలస్నానం చేయడం వల్ల కూడా జుట్టు సహజ రంగుని కోల్పోతుంది. గోధుమరంగులోకి మారుతుంది. మెరుపూ తగ్గుతుంది.  దీనికి తోడు తలపై చర్మం పొడిబారి పొలుసులు పొలుసులుగా తయారవుతుంది. అందుకే వారానికి రెండు లేదా మూడు సార్లు మాత్రమే తలస్నానం చేయాలి.

కుదుళ్లే ముఖ్యం

ఆరోగ్యకరమైన జుట్టు కుదుళ్లు నుంచే  ప్రారంభమవుతుంది. అందుకే  కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఎండలో  బయటకు వెళ్లాల్సి వస్తే టోపీ, స్కార్ఫ్​ , స్టోల్స్ వాడటం మంచిది.  హెయిర్ స్పా ట్రీట్​మెంట్ చేయించుకుంటే జుట్టు సంబంధిత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. తలకు ఉపయోగించే  దువ్వెనలు, బ్రష్​లను తరచూ వేడినీటిలో కడగాలి.  ఇతరుల దువ్వెనలను వాడకపోవడం మంచిది. ఒక్కోసారి తలస్నానం చేశాక జుట్టు ఆరబెట్టడానికి తగిన టైం ఉండదు. అలానే అల్లేసుకుని వెళ్లిపోతారు.  ఇలా చేయడం వల్ల  బ్యాక్టీరియల్, ఫంగల్​ ఇన్​ఫెక్షన్లు  ఏర్పడతాయి. అందుకే జుట్టుని చక్కగా ఆరబెట్టుకోవాలి.

లూజ్ హెయిర్​

ఈ వేసవిలో హెయిర్​ ​స్టైల్స్​ అంటూ జుట్టుని మరీ కష్టపెట్టకుండా  సులభంగా ఉండే  స్టైల్స్​ పాటించాలి.  జుట్టుని ఎక్కువగా ఒత్తిడికి గురిచేయకుండా లీవ్​ చేసుకోవడం మంచిది. అయితే జర్నీలప్పుడు లీవ్ చేయకూడదు.

స్టైలింగ్ పరికరాలు వాడుతుంటే

రకరకాల హెయిర్​ స్టైల్స్​ కోసం బ్లో డ్రయర్, స్ర్టయిట్​నర్​,  కర్లర్​ లాంటివి వాడుతుంటారు అమ్మాయిలు. అయితే  వీటిని సరైన పద్ధతిలో వాడకపోతే జుట్టు చిట్లడం, పొడిబారడం లాంటి సమస్యలు ఏర్పడతాయి.  కొంత మంది జుట్టు తడిగా ఉన్నప్పుడే బ్లో డ్రయర్​ వాడుతుంటారు. కానీ, జుట్టుని ఆరనిచ్చాకే  దీన్ని వాడాలి.  దీనివల్ల  జుట్టుపై వేడి ప్రభావం అంతగా ఉండదు.  స్ర్టయిట్​నర్, కర్లర్ ఉపయోగించే ముందు తప్పనిసరిగా ప్రొటెక్షన్ సీరమ్​లను ఉపయోగించాలి.

స్పెషల్ అకేషన్స్‌‌లో

పార్టీలు, ఫంక్షన్ల టైంలోనే ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఈ సందర్భాలు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త ప్రొడక్టుల జోలికి వెళ్లకూడదు. అవి పడకపోవడం వల్ల జుట్టు  ఊడిపోతుంది. అలాగే కలర్ వేసుకునేటప్పుడు నాణ్యమైనవి, అమోనియా లేనివే ఎంచుకోవాలి. రంగు వేసుకునే ముందు ఇతర కెమికల్స్ ఉండే ప్రొడక్టులు వాడకూడదు.

ఇవి తింటే మంచిది

చేపల్లో మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి. జుట్టుకు  పోషణ అందించే ఒమెగా3, ఫ్యాటీ ఆమ్లాలు కూడా వీటి నుంచే లభిస్తాయి. చేపల్ని తినడం వల్ల జుట్టు హెల్దీగా, అందంగా ఉంటుంది. గుడ్డులో జింక్​, సల్ఫర్, ఐరన్​, సెలీనియం లాంటి మూలకాలుంటాయి. అందుకే ప్రతిరోజు ఒక గుడ్డు తినడం వల్ల జుట్టు హెల్దీగా ఉంటుంది.

బాదం, వాల్​నట్, జీడిపప్పుల్లో కూడా ఫ్యాటీ ఆమ్లాలుంటాయి. వీటిలోని విటమిన్–​ ఇ, బయోటిన్​లు జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేస్తాయి.
జుట్టు పెరగాలంటే ఎక్కువగా ఆకుకూరలు తినాలి.  వీటిలో ఉండే ఐరన్​.. కుదుళ్లను బలంగా ఉంచడమే కాకుండా వెంట్రుకలను చిట్లకుండా చేస్తుంది. విటమిన్– ఎ కూడా జుట్టుకి చాలా మంచిది. అందుకే క్యారెట్స్, ఆకుకూరలు తినాలి.  మీగడ తీసిన పాలూ, చీజ్​ కూడా వెంట్రుకలు చిట్లిపోకుండా కాపాడతాయి. బలంగా ఉంచుతాయి.

Tagged SUMMER, sun, hair care

Latest Videos

Subscribe Now

More News