
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో బీసీ కులగణనను చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలుపుకోవాలని సూచించారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని, ఆ తర్వాతే పంచాయతీ ఎన్నికలని నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన వివిధ బీసీ సంఘాల నేతలతో కలిసి అసెంబ్లీలో సీఎం రేవంత్‌ను కలిశారు. సీఎం అయిన సందర్భంగా రేవంత్ కు శాలువా కప్పి శుభాకాంక్షలు చెప్పారు. రిజర్వేషన్లు పెంచకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే బీసీలకు అన్యాయం జరుగుతుందని సీఎం దృష్టికి తీసుకొచ్చారు.