సీన్ రీ కన్ స్ట్రక్షన్ పేరుతో తీసుకెళ్లి చంపేశారు

సీన్ రీ కన్ స్ట్రక్షన్ పేరుతో తీసుకెళ్లి చంపేశారు
  • విచారణ ఫిబ్రవరిలోపు విచారణ పూర్తయ్యే అవకాశం ఉంది
  • బాధిత కుటుంబాల తరపు న్యాయవాదులు పివి కృష్ణమా చారి, రజిని

హైదరాబాద్: దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు నియమించిన జ్యుడీషియల్ కమిటీ విచారణ తుదిదశకు చేరుకుంది. మంగళవారం జ్యుడీషియల్ కమిటీ చేపట్టిన విచారణకు బాధిత కుటుంబాల తరపు న్యాయవాదులు పివి కృష్ణమా చారి, రజిని హాజరయ్యారు. ఇప్పటి వరకు కమిషన్ సభ్యులు చూసిన సాక్ష్యులు మొత్తం ఇది ఫేక్ ఎన్ కౌంటర్ లాగే ఉన్నాయరిచ చనిపోయిన వారిలో ముగ్గురు మైనర్లు అని కమిషన్ కు తెలిపామన్నారు. 
నిందితుల్లో ముగ్గురు మైనర్లు అని తెలిసినా జ్యువైనల్ హోమ్ కు తరలించకుండా చర్లపల్లి జైలు కు తరలించారని ఆరోపించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ నిబంధనలు పాటించలేదని, ఇది ముమ్మాటికీ ఫేక్  ఎన్ కౌంటర్ అని కమిషన్ కు చెప్పామన్నారు. అలాగే ఎన్ కౌంటర్ లో చనిపోయిన నిందితులకు గాయలున్నాయని కమిషన్ దృష్టికి తీసుకొచ్చామన్నారు. 
సీన్ రీ కన్ స్ట్రక్షన్ పేరుతో తీసుకెళ్లి చంపేశారు
పోలీస్ కస్టడీలో ఉన్న నలుగురు ముద్దాయిలను సీన్ రీకన్ స్ట్రక్షన్ పేరుతో చంపేశారని, ఎన్ కౌంటర్ చేసిన వారిపై మర్డర్ కేసు నమోదు చేయాలని న్యాయవాదులు కృష్ణమాచారి, రజిని డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలన్నారు. న్యాయవ్యవస్థ ను పోలీసులు చేతుల్లోకి తీసుకోవడం సరైంది కాదని కమిషన్ కు వివరించామన్నారు. ఫిబ్రవరి లోపు కమిషన్ విచారణ పూర్తి చేసే అవకాశం ఉందని, బాధితులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు.