ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రజాప్రతినిధులంతా మొక్కలు నాటే కార్యక్రమం తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, జలవిహార్‌లో మొక్కలు నాటుతామని…తర్వాత హెల్త్ క్యాంపు ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీంతో పాటు జలవిహార్‌లో ఫోటో అండ్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు మంత్రి తలసాని. సీఎం కేసీఆర్ బాల్యం నుంచి ఇప్పటి వరకు ఆయన సాధించిన విజయాలు, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పార్టీ ముఖ్యులు హాజరుకానున్నట్లు తెలిపారు మంత్రి తలసాని.
