వాళ్ళను కావాలని విమర్శించలేదు..క్షమాపణ కూడా చెప్పాను

వాళ్ళను కావాలని విమర్శించలేదు..క్షమాపణ కూడా చెప్పాను

కరీంనగర్ జిల్లా: గంగపుత్రులను వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే అలా మాట్లాడటం జరిగిందన్నారు. దానికి నేను వారిని పిలిపించుకొని క్షమాపణలు కూడా చెప్పానన్న తలసాని..గంగ పుత్రులకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందన్నారు. గంగ పుత్రులకు ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్న ఆయన..అన్ని కుల వృత్తులకు ప్రోత్సాహం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ మీద విమర్శలు మానుకుని.. తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీ లేదని.. అంటే మేము దేశంలో ఒక భాగం కాదా? లేక మేము ఏమైనా పాకిస్థాన్ లో ఉన్నామా అన్నారు.

కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి ఏమైనా చేశామని చెప్పే దమ్ముందా, రాష్ట్రం తరపున మేము ఏం చేశామో చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో జరగడం లేదని..మమ్మల్ని విమర్శలు చేసేముందు అసలు మీరు గతంలో కానీ .. ఇప్పుడు కానీ ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు. తిట్టాలంటే మేము తిడతాం… మీకంటే తిట్లు బాగా వస్తాయి.. మాకు సంస్కారం అడ్డొస్తోందన్నారు. బీజేపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.