
సికింద్రాబాద్ లోక్ సభ స్థానంలో గెలిచిన కిషన్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అంబర్ పేట్ లో జరిగిన కార్యకర్తల సమావేశానికి తలసాని హాజరయ్యారు. రాజకీయాల్లో గెలుపోటములు సహాజమేనన్న తలసాని…. నియోజకవర్గ అభివృద్ధికి కిషన్ రెడ్డితో కలిసి పని చేస్తామని చెప్పారు. పార్టీ కార్యక్రమాలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు మంత్రి.