తాలిబాన్ల కిరాతకం: తండ్రి ఎదిరించాడని.. కొడుకును చంపిన్రు

V6 Velugu Posted on Sep 28, 2021

కాబూల్: అఫ్గానిస్థాన్‌‌ను స్వాధీనం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబాన్లు అంటే ప్రజల్లో భయాందోళనలు ఎక్కువవతున్నాయి. ఇప్పటికే చదువుకోకూడదని మహిళా హక్కులపై ఉక్కుపాదం మోపిన తాలిబాన్లు.. సాధారణ ప్రజల స్వేచ్ఛను కూడా హరిస్తున్నారు. ఐపీఎల్‌‌ జరుగుతున్న స్టేడియాల్లో లేడీ ఫ్యాన్స్ ఉన్నారని ఆ టోర్నీ ప్రసారాలపై నిషేధం విధించారు. ఎవరైనా తప్పు చేస్తే కాళ్లు, చేతులు నరికేసే శిక్షలను అమలు చేస్తామని తాలిబాన్ ఫౌండర్లలో ఒకరైన ముల్లా నూరుద్దీన్ తురాబీ అనడం సంచలనం రేపింది. 

తాజాగా తాఖిర్ ప్రావిన్స్‌లో ఓ బాలుడ్ని తాలిబాన్లు చంపిన ఘటన వారి కిరాతక పాలనకు అద్దం పడుతోంది. తాలిబాన్లపై పోరాడుతున్న రెసిస్టెన్స్ ఫోర్స్‌లో పని చేస్తున్న వ్యక్తి కుమారుడనే కారణంతో ఆ పిల్లాడ్ని  తాలిబాన్లు కిరాతకంగా చంపారు. రక్తపు మడుగులో ఆ పిల్లాడు పడి ఉన్న వీడియోను లోకల్ మీడియా షేర్ చేయడంతో ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసింది. పిల్లాడి పక్కన మరో ముగ్గురు చిన్నారులు ఏడుస్తున్న వీడియో అందర్నీ కలచి వేస్తోంది.

గమనిక: చిన్న పిల్లలపై తీవ్రమైన హింసాత్మక దృశ్యాలు ఉన్న కారణంగా ఈ వీడియోను పబ్లిష్ చేయడం లేదు.

మరిన్ని వార్తల కోసం:

పక్కా ప్లాన్‌తోనే మారణకాండ.. బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదు

తగ్గేదేలే.. పవన్‌కు మంత్రి పేర్నినాని కౌంటర్

హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ రిలీజ్

తెలంగాణ తెచ్చిన సారుకు.. సర్కారు చేసిన సన్మానం!

Tagged Afghanistan, Talibans, hanged, child died, Taliban Government, Takhar Province

Latest Videos

Subscribe Now

More News