
తమిళ హీరో కార్తి నటించిన ‘విరుమాన్’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది అదితి శంకర్. దర్శకుడు శంకర్ కూతురిగా పరిచయమైనా తనదైన నటనతో ఆకట్టుకుంటూ వరుస అవకాశాలను అందుకుంటోంది. రీసెంట్‌గా ‘మహావీరన్’ చిత్రంలో శివ కార్తికేయన్‌కు జోడీగా కనిపించి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం శింబు హీరోగా నటిస్తున్న ‘కరోనా కుమార్’ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే మరో రెండు చిత్రాల్లో నటిస్తోంది అదితి.
తాజాగా ఆమె మరో బంపర్ ఆఫర్ దక్కించుకుంది. సూర్యకు జంటగా కనిపించనుందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ‘ఆకాశం నీ హద్దురా’తో నేషనల్ అవార్డు గెలుచుకున్న టీమ్ మరోసారి క్రేజీ ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సూర్యకు జోడీగా అదితిశంకర్‌ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. కార్తితో నటించి విజయాన్ని అందుకున్న అదితి ఇప్పుడు ఆయన అన్నయ్య సూర్యకి జంటగా కనిపించడం లక్కీ ఛాన్స్అనే చెప్పాలి.