
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ కల్యాణ్ బెనర్జీ, ఆ పార్టీ సీనియర్ నేత మహువా మొయిత్రాను మరోసారి విమర్శించారు. మహువా తన స్థాయికి తగ్గ వ్యక్తి కాదని, ఆమె గురించి మాట్లాడడమంటే సమయాన్ని వృథా చేయడమేనని అన్నారు. దీంతో ఇద్దరు నేతల మధ్య దూరం మరింతగా పెరిగింది. టీఎంసీలో అంతర్గత కుమ్ములాటల కారణంగా లోక్ సభలో తృణమూల్ చీఫ్ విప్ పదవికి కల్యాణ్ బెనర్జీ రాజీనామా చేశారు. మహువా మొయిత్రా కారణంగా తాను అనేక మంది పార్టీ సహచరులకు చెడ్డవాడిగా కనిపిస్తున్నానని కల్యాణ్ బెనర్జీ తెలిపారు.