టాకింగ్​ అలారం..బెస్ట్​ గాడ్జెట్

టాకింగ్​ అలారం..బెస్ట్​ గాడ్జెట్

ఏదైనా ముఖ్యమైన పనిని ఫలానా టైంకి చేయాలి అనుకున్నప్పుడు పదే పదే టైం చూసుకుంటుంటారు చాలామంది. అలా చూసుకోకపోతే.. అనుకున్న టైం దాటిపోతుందేమో అనుకుంటారు. అలాంటివాళ్లకు ఇది బెస్ట్​ గాడ్జెట్​. ఇది ఇంట్లో ఉంటే పదే పదే టైం చూసుకోవాల్సిన పనిలేదు. అదే ప్రతిసారి టైం చెప్తుంటుంది. అంతేకాదు.. టైం సెట్​ చేసుకుంటే ఏ టైంకి చెప్పాలంటే అదే టైంకి చెప్తుంది.10 నిమిషాల స్నూజ్ ఫంక్షన్ ‌ ఉంటుంది. ఐదు రకాల అలారం సౌండ్స్​ ఉన్నాయి. స్మార్ట్ బ్యాక్ ‌లైట్ ఉండడం వల్ల రాత్రిళ్లు టైం స్పష్టంగా కనిపిస్తుంది. టైంతోపాటు నెల, తేదీ, అలారం సెట్టింగ్, ఇండోర్ టెంపరేచర్​ డిస్​ప్లే అవుతాయి. 

ధర: 1,475 రూపాయలు