తన బ్యూటీ సీక్రెట్‌ చెప్పిన తమన్నా

తన బ్యూటీ సీక్రెట్‌ చెప్పిన తమన్నా

‘‘నా జుట్టు అంటే నాకు చాలా ఇష్టం. అందుకే దాని కోసం ఎక్కువ కాస్మోటిక్స్‌ ఉపయోగించ కుండా.. ఎప్పుడూ సహజంగా ఉండేలా చూస్తాను. నా జుట్టుకు ఉల్లిపాయ రసాన్ని వాడతాను’’ అని తన బ్యూటీ సీక్రెట్‌ చెప్పింది మిల్కీ బ్యూటీ తమన్నా. అలాగే తనకు నచ్చిన వస్తాలనే వేసుకుంటానని తెలిపింది. ఎప్పుడూ సదారణంగా ఉండడమంటేనే తనకు ఇష్టమని వెల్లడించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు పలు విషయాలపై స్పందించింది తమన్నా.

ఇక ఈ అమ్మడు నటుడు విజయ్‌ వర్మతో రిలేషన్‌లో ఉందనే వార్త కొన్ని రోజులుగా వార్తలు వస్తు్న్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ఈ బ్యూటీ షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘మేమిద్దరం కలిసి ఓ సినిమాలో నటించాం. అప్పటి నుంచి మాపై రూమర్స్‌ ప్రచారం చేస్తున్నారు. దీనిపై అందరికీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదని తమన్నా క్లారిటీ ఇచ్చింది. అయినా హీరోయిన్స్‌ గురించి ఇలాంటి అవాస్తవాలు ఎలా తెరపైకి వస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. డాక్టర్‌ నుంచి బిజినెస్‌మెన్‌ వరకు నాకు తెలియకుండానే కొందరు ఇప్పటికే నా పెళ్లి చాలాసార్లు చేశారు’’ అని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఈ మిల్కి బ్యూటీ స్టార్ హీరోలకు జోడీగా నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘భోళా శంకర్‌’లో ఆడిపాడనుంది. మరోవైపు తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో కలిసి ‘జైలర్‌’లో నటిస్తోంది. వీటితోపాటు ‘అరణ్మయై4’, ‘బోలేచుడియన్‌’,‘భంద్రా’ చిత్రాలతో బిజీగా ఉంది.