
ఇప్పటివరకూ గ్లామర్ రోల్స్‌తో పాటు స్పెషల్ సాంగ్స్‌తోనూ ఆకట్టుకున్న తమన్నా.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఓ ఎరోటిక్ హారర్ థ్రిల్లర్‌లో నటించబోతోంది. ‘రాగిణి ఎంఎంఎస్’ ఫ్రాంచైజీకి అంటూ బాలీవుడ్ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. హారర్, థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో పాటు బోల్డ్ కంటెంట్, ఎరోటిక్ సీన్స్‌తో ఈ సిరీస్‌లో వచ్చిన రెండు చిత్రాలు ఆకట్టుకున్నాయి.
సెకండ్ పార్ట్ ‘రాగిణి ఎంఎంఎస్ 2’లో సన్నీ లియోన్ లీడ్ రోల్ చేసింది. సినిమాలోని బోల్డ్ సీన్స్‌తో పాటు ఇందులోని ‘బేబీ డాల్’పాట ఆమెకు బాలీవుడ్‌లో సూపర్ క్రేజ్ తీసుకొచ్చింది. ఈ చిత్రం వచ్చి 11 ఏళ్లు అవుతుండగా నిర్మాత ఏక్తా కపూర్ ఇప్పుడీ ఫ్రాంచైజీలో మూడో చిత్రం నిర్మించబోతోంది.
ఈసారి హీరోయిన్‌గా తమన్నాను తీసుకోవాలని భావించిన ఏక్తా.. స్వయంగా ఆమెతో చర్చలు జరిపినట్టు సమాచారం. తమన్నా కూడా సానుకూలంగా స్పందించినట్టు బాలీవుడ్ టాక్.
ఇప్పటికే కంఫర్ట్ జోన్ దాటి ‘లస్ట్ స్టోరీస్ 2’లో బోల్డ్ సీన్స్ చేసి ఆశ్చర్యపరిచిన తమన్నా.. ఈ ఎరోటిక్ థ్రిల్లర్‌తో అంతకుమించిన బోల్డ్ స్టెప్ వేయబోతోంది. ప్రస్తుతానికి ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ విషయంపై ఇతరత్రా వివరాలను త్వరలో రివీల్ చేయనున్నారు.