జమున బయోపిక్‌‌‌‌లో తమన్నా

జమున బయోపిక్‌‌‌‌లో తమన్నా

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో బయోపిక్‌‌‌‌లకు క్రేజ్‌‌‌‌ ఏర్పడింది. పొలిటికల్, స్పోర్ట్స్ పర్సన్స్‌‌‌‌తో పాటు సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖుల జీవితం ఆధారంగా ఇప్పటికే కొన్ని బయోపిక్స్ స్ర్కీన్‌‌‌‌పై కనిపించాయి. తమన్నా కూడా సీనియర్ నటి జమున బయెపిక్‌‌‌‌లో నటించనుందని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌‌‌‌గా జమున మరణించడంతో ఆ వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి.  కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఒకరు ఈ బయోపిక్ బాధ్యతలు తీసుకున్నారట.  

జమున బతికున్నప్పుడే  స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయిందట.  ఇక సెట్స్‌‌‌‌కి వెళ్లడమే ఆలస్యమని ప్రచారం జరుగుతోంది. జమున ఇండస్ట్రీకి వచ్చినప్పట్నుంచీ ఆమె కెరీర్‌‌‌‌‌‌‌‌తో పాటు  ఆమె ఆత్మాభిమానం, గొడవలు, ప్రేమ, పెళ్లి .. ఇవన్నీ ఈ బయోపిక్ లో చూపించనున్నట్టు తెలుస్తోంది. జమున పాత్రకు తమన్నానే పర్ఫెక్ట్ చాయిస్ అని భావిస్తున్న మేకర్స్.. తనతో  చర్చించగా ఆమెకూడా ఓకే చెప్పినట్లు సమాచారం.  ప్రస్తుతం తమన్నా.. రజినీకాంత్‌‌‌‌కి జంటగా ‘జైలర్‌‌‌‌‌‌‌‌’లో, చిరంజీవి సరసన ‘భోళా శంకర్’లో నటిస్తోంది. మరోవైపు హిందీలో ఓ చిత్రం, మలయాళంలో మరో చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.