
తమన్నా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి పద్దెనిమిదేళ్లు కావస్తున్నా, ఇప్పటికీ కొత్త హీరోయిన్స్‌కు పోటీ ఇస్తూ దూసుకెళుతోంది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవికి జంటగా ‘భోళా శంకర్’లో నటిస్తుంది. ఈ మూవీని మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే కొత్త షెడ్యూల్ మొదలైంది. ‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత చిరంజీవికి జంటగా నటిస్తున్న రెండో సినిమా ఇది. అయితే ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే ఈ అమ్మడు రజనీకాంత్ సినిమాలో చాన్స్ అందుకుంది. ‘డాక్టర్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో తలైవాకి జంటగా తమన్నాను ఫైనల్ చేసినట్టు సన్ పిక్చర్స్ సంస్థ అనౌన్స్ చేసింది.
ఇప్పటికే షూటింగ్‌లో కూడా జాయిన్ అయింది. ఇక్కడ చిరంజీవి, అక్కడ రజినీకాంత్ సినిమాల్లో నటిస్తూ, స్టార్ హీరోల బెస్ట్ చాయిస్‌గా మారింది తమన్నా. ఇక బాలీవుడ్ మూవీ ‘బోలే చుడియన్’లో నటిస్తున్న ఆమె, మరోవైపు మాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తోంది. దిలీప్‌కు జంటగా ‘బాంద్రా’ అనే సినిమాలో యాక్ట్ చేస్తోంది. ఇలా నాలుగు భాషల్లో నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నప్పటికీ, ఓ బాలీవుడ్ యాక్టర్‌తో ఆమె డేటింగ్ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. కొద్ది నెలల క్రితం ఓ బిజినెస్ మ్యాన్‌తో మ్యారేజ్ అనే వార్తలు వస్తే.. ‘ఎఫ్ 3’లోని తన మేల్ గెటప్ వీడియో పోస్ట్ చేసి కౌంటర్ ఇచ్చింది. మరి తమన్నా ఈసారి ఎలా రియాక్ట్ అవుతుందో!