
హీరోయిన్ తమన్నా భాటియా(Tamannaah Bhatia) ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. లేటెస్ట్ గా తమన్నా భారీ డైమండ్ రింగ్( Diamond Ring) తో కనిపించిన ఫోటో వైరల్ అవుతోంది. ఇది ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద వజ్రం అని..మెరిసే మెరుపు..అద్భుతమైన పరిమాణం కలిగి ఉన్న ఈ డైమండ్ అందరిని ఆకర్షిస్తుంది. దీని విలువ రూ. 2 కోట్లు ఉంటుందని సమాచారం.
ఈ డైమండ్ రింగ్ ను రామ్ చరణ్(Ram Charan) భార్య ఉపాసన(Upasana) గిఫ్ట్ గా ఇచ్చారని తెలుస్తోంది. 2019 కొణిదెల ప్రొడక్షన్ లో వచ్చిన సైరా నరసింహ రెడ్డి మూవీ లో నటించిన విషయం తెలిసిందే.. కాగా ఈ మూవీలో తమన్నా అద్భుతమైన నటనకు ముగ్ధులయిన ఉపాసన ఈ విలువైన గిఫ్ట్ ను ఇచ్చారని తెలుస్తోంది.
తమన్నా డైమండ్ రింగ్ ధరించి ఉన్న ఫోటోతో ఉపాసన ట్వీట్ చేస్తూ.. ' సైరా లో మీ యాక్టింగ్ కు ఫిదా అయ్యాను..ఈ డైమండ్ రింగ్ ఇస్తున్నందుకు చాలా హ్యాపీ..త్వరలో మరో మూవీ తో కలుద్దాం' అంటూ తెలుపగా.. 'మీ మంచి మనసుతో ఇచ్చిన ఈ విలువైన కానుకకు కృతజ్ఞతలు' అంటూ రిప్లై ఇచ్చింది తమన్నా. దీంతో వీరి మధ్య ఉన్న స్నేహానికి మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
A gift for the super @tamannaahspeaks
— Upasana Konidela (@upasanakonidela) October 3, 2019
from Mrs Producer ?❤️?
Missing u already. Catch up soon. #SyeraaNarashimaReddy pic.twitter.com/rmVmdwWNAd
తమన్నా ఇటీవల లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో నటించింది. ఈ మూవీలో ఎక్కువగా బోల్డ్ సీన్స్ ఉండటంతో బాగా సొషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. అలాగే నటుడు విజయ్ వర్మ తో ప్రేమ, పెళ్లికి సంబంధించిన వార్తలు రావడంతో మరింత పాపులారిటీ తెచ్చుకోంది. తమన్నా ప్రస్తుతం చిరు భోళా శంకర్,రజినీకాంత్ జైలర్, అజిత్ వంటి స్టార్లతో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.