రిలీజ్ కు సిద్ధంమైన గుర్తుందా శీతాకాలం

రిలీజ్ కు సిద్ధంమైన గుర్తుందా శీతాకాలం

సత్యదేవ్ హీరోగా తమన్నా, కావ్యశెట్టి, మేఘ ఆకాష్ హీరోయిన్స్‌‌గా నటించిన చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. నాగశేఖర్ దర్శకుడు. చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ కలిసి నిర్మించారు.  డిసెంబర్ 9న సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా కావ్య శెట్టి మాట్లాడుతూ ‘మాది కర్ణాటక. కన్నడ సినిమాలే ఎక్కువ చేశా. ఇటీవల మలయాళ, తమిళంలోనూ కొన్ని మూవీస్ చేశా.  తెలుగులో నేను నటించిన ఫస్ట్ మూవీ ఇది. సత్యదేవ్ జీవితంలో మూడు దశల్లో జరిగే ప్రేమకథలే ఈ సినిమా కథ.

స్కూల్ నుంచి తన స్టోరీస్‌‌ అన్నీ శీతాకాలంలోనే స్టార్ట్ అవుతాయి.  అందుకే ఈ టైటిల్ పెట్టారు. అమ్ము పాత్రలో కనిపిస్తా. నా కెరీర్‌‌‌‌లో గుర్తుండే పాత్ర అవుతుంది. అలాగే తెలుగులో నాకిది పర్ఫెక్ట్‌‌ లాంచ్ అనుకుంటున్నా. సత్యదేవ్ చాలా హార్డ్ వర్కర్. డైలాగ్స్ విషయంలో బాగా సపోర్ట్ చేశారు. తనతో నటించడం హ్యాపీ. యూత్‌‌కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. కన్నడ నుంచి వచ్చిన అనుష్క శెట్టి, పూజా హెగ్డే, రష్మిక, నేహా శెట్టి, కృతి శెట్టిని ఆదరించినట్టే నన్ను కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా’ అని చెప్పింది.