
ఇప్పటికే పలు వెబ్ సిరీస్‌లతో ఓటీటీలోనూ రాణించిన తమన్నా.. మరో కొత్త సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ‘డు యూ వనా పార్ట్‌నర్’ పేరుతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను సోమవారం ప్రకటించారు. సెప్టెంబర్ 12 నుంచి ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. తమన్నాతో పాటు మరో ఫిమేల్ లీడ్‌గా డయానా పెంటీ నటిస్తోంది. కాలిన్, అర్జిత్ కుమార్ దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఇందులో శిఖ, అనహిత అనే ఫ్రెండ్స్‌గా తమన్నా, డయానా నటిస్తున్నారు. వీళ్లిద్దరూ కలిసి పార్ట్‌నర్స్‌గా ఓ ఆల్కహాల్ స్టార్టప్‌ను ప్రారంభిస్తారు.
మేల్ డామినేటెడ్ అయిన బీర్ ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు, వీళ్ల ప్రయాణం ఏ మలుపు తీసుకుందనేది మెయిన్ కాన్సెప్ట్. ఆశయం, స్నేహం ప్రధానాంశాలుగా సాగే కామెడీ డ్రామా ఇది. జావేద్ జఫ్రీ, నకుల్ మెహత, నీరజ్ కబి, శ్వేతా తివారీ, సూఫీ మోటివాలా, రన్‌విజయ్ సింఘా ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. గత ఏడాది ‘డేరింగ్ పార్ట్‌నర్స్’ టైటిల్‌తో అనౌన్స్‌మెంట్ వచ్చిన ఈ సిరీస్.. ఇప్పుడు టైటిల్ మార్చుకుని ‘డు యూ వనా పార్ట్‌నర్’గా ప్రేక్షకుల ముందుకొస్తోంది.