
ఓ వైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న తమన్నా.. మరోవైపు బ్యాక్ టు బ్యాక్ వెబ్ సిరీస్‌ల్లోనూ నటిస్తోంది. ఇప్పటికే సౌత్‌లో రెండు వెబ్ సిరీస్‌లు చేసిన ఆమె, త్వరలో రెండు హిందీ వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. వాటిలో ‘జీ కర్దా’ అనే సిరీస్ ఈనెల 15 నుండి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. తాజాగా ఆమె నటించిన మరో వెబ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్ 2’ స్ట్రీమింగ్ డేట్‌ను అనౌన్స్ చేయడంతోపాటు టీజర్ రిలీజ్ చేశారు. 2018లో విడుదలై సంచలనం సృష్టించిన ‘లస్ట్ స్టోరీస్’కు ఇది సీక్వెల్. తమన్నాతో పాటు కాజోల్, నీనా గుప్తా, మృణాల్ ఠాకూర్ నటించారు. తమన్నాతో డేటింగ్ వార్తల్లో ఉన్న విజయ్ వర్మ ఇందులో ఆమెకు జంటగా నటించాడు.
నాలుగు కథలతో రానున్న ఈ సిరీస్‌ను అమిత్ రవీంద్రనాథ్ శర్మ, కొంకణా సేన్ శర్మ, ఆర్.బాల్కి, సుజోయ్ ఘోష్‌లు డైరెక్ట్ చేశారు. కారు కొనే ముందు టెస్ట్ డ్రైవ్ చేసినట్లే, పెళ్లికి ముందు టెస్ట్ డ్రైవ్ చేయరా అంటూ కొత్త జంటకు నీనా గుప్తా సలహా ఇవ్వడాన్ని బట్టి ఇది ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. ఈనెల 29 నుండి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. సో.. ఈ నెలలో రెండు వారాల గ్యాప్‌లో తమన్నా నటించిన రెండు వెబ్ సిరీస్‌లు రాబోతున్నాయి. ఇందులో ఒకటి రొమాంటిక్ డ్రామా కాగా, మరొకటి అడల్ట్ కంటెంట్ సిరీస్ కావడం విశేషం.