ఓటేసేందుకు సైకిల్ మీదెళ్లిన స్టార్ హీరో

V6 Velugu Posted on Apr 06, 2021

చెన్నై: ప్రజలకు ఓటు విలువ తెలియజేసేందుకు సెలబ్రిటీలు తమవంతు ప్రయత్నాలు చేస్తుంటారు. ఓటేసిన ఫోటోలను ట్వీట్ చేస్తూ అందరితో పంచుకుంటారు. ఈ క్రమంలో ప్రముఖ తమిళ హీరో విజయ్ డిఫరెంట్ గా ఓటేసి అందరి దృష్టిని ఆకర్షించారు. తన ఫ్యాన్స్ తో కలసి సైకిల్ మీద బూత్ కు చేరుకొని ఓటేశారు. అయితే స్టార్ హీరో, అందులోనూ యమా క్రేజ్ ఉండటంతో ఆయనకు జనాల తాకిడి ఎక్కువైంది. దీంతో ఇళయదళపతిని ఫాలో అవుతున్న ప్రజలను కట్టడి చేయడానికి లాఠీలు ఝళిపించాల్సి వచ్చింది. తాను ఓటు వేసే పోలింగ్ బూత్ ఉన్న వీధి చిన్నది కావడంతో పార్కింగ్ సమస్యలు ఎదురు కావొద్దనే ఉద్దేశంతోనే విజయ్ సైకిల్ తొక్కుకుంటూ వచ్చాడని తెలిసింది. 

Tagged assembly elections 2021, chennai, tamilnadu, Actor Vijay, video viral, cycle, voting, ride

Latest Videos

Subscribe Now

More News