అత్యంత విషమంగా తమిళ హీరో విజయకాంత్ ఆరోగ్యం

అత్యంత విషమంగా తమిళ హీరో విజయకాంత్ ఆరోగ్యం

డీఎండీకే అధినేత, సీనియర్‌ నటుడు విజయకాంత్(Vijayakanth) ఆరోగ్య పరిస్థితి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు వైద్యులు. చెన్నై మయత్ ఆస్పత్రి యాజమాన్యం నివేదిక ప్రకారం.. విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉందని, మెరుగైన చికిత్స అందిస్తున్నాం అని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

అయితే.. విజయకాంత్ అనారోగ్య కారణంగా నవంబర్ 18న మయత్ హాస్పిటల్ లో చేరిన విషయం తెలిసిందే. దగ్గు, జలుబు, గొంతునొప్పి కారణంగా హాస్పిటల్ లో చేరిన ఆయన.. దాదాపు 10 రోజులుగా అక్కడే చికిత్స పొందుతున్నారు. ఇక ఇదే విషయం తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు ఆసుపత్రి యాజమాన్యం. మరోపక్క.. డీఎండీకే పార్టీ శ్రేణులు మాత్రం విజయకాంత్ అభిమానులు ఆందోళన చెందవద్దని, ఒకట్రెండు రోజుల్లో ఆయన ఇంటికి తిరిగి వస్తారని చెప్తున్నారు.

Also Read:-కేబీసీ చరిత్రలో సరికొత్త రికార్డ్.. కోటి గెలుచుకున్న 12 ఏళ్ళ కుర్రాడు