కేబీసీ చరిత్రలో సరికొత్త రికార్డ్.. కోటి గెలుచుకున్న 12 ఏళ్ళ కుర్రాడు

కేబీసీ చరిత్రలో సరికొత్త రికార్డ్.. కోటి గెలుచుకున్న 12 ఏళ్ళ కుర్రాడు

చరిత్ర సృష్టించిన బుల్లితెర షోలలో కౌన్ బనేగా కరోడ్‌పతి(Kaun Banega Crorepati) ఒకటి. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్(Amitab Bachhan) హోస్ట్ గా 2000 సంవత్సరంలో మొదలైన ప్రముఖ ఈ క్విజ్ షో.. గత 22 ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. అంతేకాదు ఈ షో విజ్ఞానానికి సంబంధించింది కాబట్టి.. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా  ఇష్టపడతారు. ఈ షో పాల్గొన్న చాలా మంది సామన్యుల జీవితాలు కూడా మారిపోయాయి. ప్రస్తుతం ఈ షోలో సీజన్ 15 కేబీసీ జూనియర్స్ వీక్ నడుస్తుంది. ఇందులో తొలిసారిగా ఓ 12 ఏళ్ల కుర్రాడు కోటి రూపాయలు గెలుచుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. 

కేబీసీ జూనియర్స్ వీక్ లో భాగంగా జరిగిన చివరి ఎపిసోడ్ లో హర్యానాకు చెందిన మాయంక్ హాట్ సీట్ కు చేరుకున్నాడు. 12 ఏళ్ల ఈ కుర్రాడు అమితాబ్ అడిగిన ప్రశ్నలకు ఎలాంటి జంకు లేకుండా సమాధానలు చెప్తూ వచ్చాడు. అలా కోటి రూపాయల ప్రశ్న వరకు వచ్చింది ఆట. కొత్త కండానికి అమెరికా అని పేరు పెట్టిన యురోపియన్ కార్టో గ్రాఫర్ ఎవరు? అని ప్రశ్నించాడు అమితాబ్. దానికి కాసేపు ఆలోచనలో పడిపోయిన మయాంక్.. పాలిటిక్స్ గురించి తెలిసిన ఓ వ్యక్తి సహాయం తీసుకొని మార్టిన్ వాల్డ్సీ ముల్లర్ అని సరైర సమాధానం చెప్పాడు. ఈ సమాధానంతో మయాంక్ కోటి రూపాయలు గెలుచుకున్నాడు. ఇక కేబీసీ జూనియర్స్ వీక్ లో భాగంగా తొలిసారి కోటి గెల్చుకున్న వ్యక్తిగా మయాంక్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.

Also Read:-దసరా మళ్లీ వచ్చిందా.. ఓటు కోసం హైదరాబాద్ ఖాళీ..