ప్రేమించిన పాపానికి నరకం చూసింది.. రోజూ చిత్రహింసలు..

ప్రేమించిన పాపానికి నరకం చూసింది.. రోజూ చిత్రహింసలు..

ప్రేమించిన పాపానికి నరకం చూసింది.. రోజూ చిత్రహింసలు.. రాత్రీ పగలు తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు.. ఎక్కడ పడితే అక్కడ.. ఎలా పడితే అలా.. చావకొట్టాడు ఆ బాయ్ ఫ్రెండ్. ప్రియుడు చేతుల్లో దారుణంగా దెబ్బలు తిని ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది తమిళ నటి అనికా విక్రమన్.  సినిమాల్లో.. టీవీ షోల్లో.. సీరియల్స్ లో నటించింది అనికా విక్రమన్.. కొన్ని రోజులుగా ఆమె అనూప్ పిళ్లై అనే వ్యక్తితో రిలేషన్ లో ఉంది. ఏడాది కాలంలో ఇద్దరూ ఒకే ఇంట్లో కలిసిమెలిసి ఉంటున్నారు. పెళ్లి చేసుకోలేదు కానీ.. కలిసే జీవిస్తున్నారు. అతన్ని కూడా విపరీతంగా ప్రేమించిన అనికా విక్రమన్.. త్వరలో పెళ్లి చేసుకోవాలని భావించింది. 

ఈ క్రమంలోనే అనికా సోషల్ మీడియాలో కొన్ని తన పరిస్థితిని వివరిస్తూ ఫొటోలు పెట్టటం సంచలనంగా మారింది. రిలేషన్ షిప్ లో ఉన్న అనూప్ పిళ్లై అరాచకాన్ని రాసుకొచ్చింది. ఫొటోల్లో అనికా రూపు రేఖలే మారిపోయాయి. ముఖం అంతా వాచింది. శరీరం అంతా నల్లగా మారింది. తీవ్రగాయాలు కనిపిస్తున్నాయి. ముఖం, చేతులు, కాళ్లు, పొట్ట భాగంల్లో గాయాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు స్పష్టం చేసింది. ఈ గాయాలు ఒక రోజులో అయినవి కావని.. కొన్ని నెలలుగాచిత్రహింసలు అనుభవిస్తున్నట్లు స్పష్టం చేసింది అనికా విక్రమన్.

నన్ను మానసికంగా.. శారీరకంగా చిత్రహింసలకు గురి చేశాడు.. ఇలాంటి వ్యక్తిని నా జీవితంలో ఇప్పటి వరకు చూడలేదు.. నా బాధ చూసినా అతనిలో మార్పు రాలేదు.. నా కన్నీళ్లు చూసినా అతని మనస్సు మారలేదు.. రోజు రోజుకు అతని హింస పెరిగిపోయింది.. అతనితో ఉంటే ఇలాంటి జీవితం వస్తుందని కలలో కూడా ఊహించలేదు..ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు.. ఇలా జరగటం మొదటి సారి కాదు.. రెండోసారి అంటూ తన ఇన్ స్ట్రాలో రాసుకొచ్చింది అనికా. దీనిపై ఇప్పటికే పోలీస్ కంప్లయింట్ ఇచ్చినట్లు వివరించింది ఈ తమిళ నటి. మొదట్లోనే దీనిపై పోలీస్ కంప్లయింట్ ఇద్దామని అనుకున్నాను.. అయితే నా కాళ్లపై పడి వేడుకున్నాడు.. కన్నీళ్లు పెట్టుకున్నాడు మానవత్వంతో.. ప్రేమించిన పాపానికి వదిలేశాను.. అయినా అతని మనస్సు మారలేదు.. మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడు.. అందుకే ఈసారి క్షమించదలచుకోలేదు అంటూ వెల్లడించింది అనికా.

నటి అనికా పరిస్థితి చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. తెరపై ఎంతో అందంగా కనిపించే అనికా.. ఇలా మారిపోవటం.. శరీరంపై గాయాలు ఉండటంతో సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ప్రియుడు అనూప్ పిళ్లైను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్.. ప్రపంచ మహిళా దినోత్సవం రోజు ఓ నటికి ఇలా జరగటం దారుణం అంటున్నారు అభిమానులు..