బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీ అవుతున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ చిత్రంలో నటిస్తున్నాడు. దీని తర్వాత సుకుమార్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయాల్సి ఉంది. తాజాగా చరణ్ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ వినిపిస్తోంది. బీస్ట్, జైలర్ లాంటి మాసివ్ హిట్స్‌ను రూపొందించిన తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌తో చరణ్ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. నెల్సన్ ఇప్పటికే కథ చెప్పగా చరణ్‌కు బాగా నచ్చిందట.
దీంతో ఈ క్రేజీ ప్రాజెక్టు ఆల్మోస్ట్ కన్‌ఫర్మ్ అని తెలుగుతోపాటు తమిళనాట కూడా కథనాలు వస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోందని అతి త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే చాన్స్ ఉందని సమాచారం. అయితే చరణ్ నటిస్తున్న ‘పెద్ది’తో పాటు సుకుమార్ మూవీ కూడా పూర్తయిన తర్వాతే ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉందట. మరోవైపు నెల్సన్ కూడా ప్రస్తుతం ‘జైలర్2’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. దీని తర్వాత తను కూడా మరో మూవీ చేయాల్సి ఉందట. దీంతో చరణ్, నెల్సన్ కాంబో వచ్చే ఏడాది చివరిలో ప్రారంభం కానుందని తెలుస్తోంది.
