OTT Horror: తెలుగులో ఓటీటీకి వచ్చిన తమిళ హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Horror: తెలుగులో ఓటీటీకి వచ్చిన తమిళ హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

2025లో విడుదలైన తమిళ హారర్ ఫాంటసీ మూవీ జిన్ ది పెట్ (Jinn The Pet). టిఆర్ బాల తన తొలి దర్శకుడిగా ఫెయిరీ టేల్ పిక్చర్స్ బ్యానర్‌పై, అనిల్ కుమార్ రెడ్డి AR టూరింగ్ టాకీస్‌తో కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీలో ముగేన్ రావు మరియు భవ్య త్రిఖ ప్రధాన పాత్రల్లో నటించారు. బాల శరవణన్, ఇమ్మాన్ అన్నాచి, రాధా రవి, వడివుక్కరసి , జార్జ్ విజయ్, మాస్టర్ శక్తి మరియు ఇతరులు సహాయక పాత్రల్లో నటించారు.

తమిళంలో మే 30న థియేటర్లలో విడుదలైన జిన్ ది పెట్ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. కానీ, 8 రేటింగ్ సాధించుకుంది. మొన్నటివరకు తమిళ వెర్షన్‌లోనే మాత్రమే స్ట్రీమింగ్ అయిన ఈ మూవీ.. ఆగస్ట్ 1 నుంచి తెలుగులో అందుబాటులోకి వచ్చింది. SUN NXT వేదికగా స్ట్రీమ్ అవుతుంది. హారర్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఈ మూవీ మంచి థ్రిల్లింగ్ ఇవ్వనుంది. కామెడీ, అడల్ట్, యాక్షన్, ఫాంటసీ, సైకలాజికల్ వంటి వివిధ ఎలిమెంట్స్‌ను ఇందులో చూపించారు. 

కథేంటంటే:

శక్తి (ముగెన్‌‌రావు) మలేసియాలోని ఒక మ్యూజిక్ బ్యాండ్‌‌లో ఐదు సంవత్సరాలపాటు పనిచేస్తాడు. అతని జీవితం దురదృష్టానికి కేరాఫ్‌‌. ఎందులోనూ సక్సెస్‌‌ కాలేకపోతాడు. అందుకే అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని నమ్మి ఒక పెట్టెని కొంటాడు. అందులో మచ్చిక చేసుకున్న జిన్‌‌(భూతం) ఉంటుంది. ఆ పెట్టెతో తన తలరాత పూర్తిగా మారిపోతుంది అనుకుంటాడు శక్తి. దాన్ని తీసుకుని మలేసియా నుంచి చెన్నైకి వస్తాడు. అక్కడ ఒక మ్యూజిక్ బ్యాండ్‌‌ను ఏర్పాటు చేసి, ఈవెంట్స్‌‌, రెస్టోబార్‌‌లలో పర్ఫార్మెన్స్‌‌ ఇవ్వాలనేది అతని లక్ష్యం. కానీ, పరిస్థితి చాలా గందరగోళంగా మారిపోతుంది. జిన్‌‌ని ఇంటికి తీసుకొచ్చాక ఒకరోజు అతని భార్య ప్రియ (భవ్యత్రిక) రక్తస్రావంతో స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. అందరూ దానికి కారణం జిన్ అనుకుంటారు. వాస్తవానికి అక్కడ ఏం జరిగింది? జిన్ ఏం చేయాలి అనుకుంది? తెలియాలంటే సినిమా చూడాలి.