తమిళం ప్రపంచంలోనే అతి పురాతన భాష : మోడీ

తమిళం ప్రపంచంలోనే అతి పురాతన భాష : మోడీ

తమిళం ప్రపంచంలోనే అతి పురాతన భాష అన్నారు ప్రధాని మోడీ. అమెరికాలోనూ తమిళ భాషకు గుర్తింపు ఉందన్నారు. హౌడీ మోడీ సభలో తాను తమిళంలో మాట్లాడినపుడు మంచి స్పందన వచ్చిందని చెప్పారు మోడీ. తమిళనాడులో పర్యటిస్తున్న ప్రధాని.. సింగపూర్- ఇండియా హాకథాన్ కు హాజరయ్యారు. హాకథాన్ విజేతలకు బహుమతులు అందించారు.

తర్వాత ఐఐటీ మద్రాస్ క్యాంపస్ కు వెళ్లారు ప్రధాని మోడీ. మధ్యాహ్నం జరగనున్న ఐఐటీ మద్రాస్ 56వ వార్షికోత్సవానికి ఆయన హాజరవుతారు. అంతకుముందు చెన్నై వచ్చిన ప్రధాని మోడీకి ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం లభించింది. తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి, కొందరు మంత్రులు, ఉన్నతాధికారులు మోడీకి స్వాగతం చెప్పారు.