ఆస్కార్‌ బరిలో తమిళ చిత్రం ‘కూళంగల్’

ఆస్కార్‌ బరిలో తమిళ చిత్రం ‘కూళంగల్’

తమిళ  సినిమా ‘కూళంగల్’ 2022లో జరిగే 94వ ఆస్కార్‌ పోటీలకు మనదేశం తరఫు నుంచి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ విషయాన్ని  శనివారం ఆస్కార్‌ సెలక్షన్‌ కమిటీ ఛైర్‌ పర్శన్‌ షాజీ ఎన్‌ కరుణ్‌ ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు  ఎఫ్‌ఎఫ్‌ఐ జనరల్‌ క్రెటరీ సుప్రాన్‌ సెన్‌ తెలిపారు. 

2022 బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరిలో పోటీ పడేందకు మన భారత దేశం తరుపున అధికారిక ఎంట్రీ కోసం పలు సినిమాలు పోటీ పడ్డాయి. ఆస్కార్ లిస్ట్‌లో కేంద్రం 15 మంది సభ్యులతో ఓ జ్యూరీని ఏర్పాటు చేసింది. ఇందులో మన దేశం నుంచి ఎంపిక చేసిన 14 సినిమాలను చూసి ఫైనల్‌గా ‘కూజంగల్’ మూవీని మన దేశం తరుపున ఉత్తమ విదేశీ చిత్రాల కేటగిరిలో అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. ‘కూజంగల్’ మూవీని నయనతార, విఘ్నేష్ శివన్ కలిసి రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు.  పీఎస్‌ వినోద్‌ కుమార్‌ దర్శకత్వం వహించాడు.

కుటుంబంలో జరిగిన ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా కూళంగల్‌ తెరకెక్కింది. ఇద్దరి తండ్రీకొడుకుల స్టోరీ. తాగుబోతు తండ్రి వేధింపులు భరించలేక తల్లి ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. ఆమెను తిరిగి వెనక్కి ఎలా తీసుకొచ్చారనేదే ఈ సినిమా సారాంశం. ఈ సినిమాకు యువన్‌ శంకర్‌ రాజా అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.