వ్యవసాయ పొలంలో గంజాయి సాగు..300 మొక్కలు ధ్వంసం

వ్యవసాయ పొలంలో గంజాయి సాగు..300 మొక్కలు ధ్వంసం

గంజాయి సాగు చేస్తున్నారనే ఆరోపణలతో నలుగురు గిరిజనులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కోయంబత్తూరు శివార్లలోని పాలమలై సమీపంలో ఉన్న పసుమణిలో చోటుచేసుకుంది. గిరిజన సెటిల్‌మెంట్‌లో వ్యవసాయ పొలంలో గంజాయి సాగు చేస్తున్నారనే ఆరోపణలపై కోయంబత్తూరు పోలీసులు గురువారం దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే  నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ దాడిలో దాదాపు 300 మొక్కలను వెలికితీసి ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు.

సుమారు 15.3 కిలోల బరువున్న 300 గంజాయి మొక్కలను కోయంబత్తూర్ పోలీసులు తొలగించారు. అనంతరం సంఘటనా స్థలాన్ని సందర్శించిన కోయంబత్తూరు జిల్లా ఎస్పీ బద్రీనారాయణన్... గంజాయి సాగులో మునిగిపోవద్దని స్థానికులకు సూచించారు. ఆ తర్వాత పోలీసులు తదుపరి విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.