ఆంధ్ర–తమిళనాడు మత్స్యకారుల మధ్య గొడవ.. తీవ్ర గాయాలు

ఆంధ్ర–తమిళనాడు మత్స్యకారుల మధ్య గొడవ.. తీవ్ర గాయాలు

ఏపీలోని నెల్లూరు జిల్లా అల్లూరు (మం) ఇసుకపల్లి సముద్ర తీరంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆంధ్ర, తమిళనాడు మత్స్యకారులు మధ్య గొడవ జరిగింది. తమిళనాడులోని కడలూరుకు చెందిన మత్స్యకారుల బోట్లు ఆంధ్ర తీర ప్రాంతంలోకి వచ్చాయి. ఈ క్రమంలో కడలూరు బోట్లు తగిలి ఇసుకపల్లి మత్స్యకారుల వలలు తెగిపోయాయి. ఇదేంటని ప్రశ్నించిన ఇసుకపల్లి జాలర్లపై తమిళనాడు జాలర్లు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇసుకపల్లి మత్స్యకారులు తీవ్రంగా గాయపడ్డారు.

దీంతో ఆగ్రహించిన ఇసుకపల్లి జాలర్లు తమిళనాడు జాలర్లపై దాడి చేసేందుకు గాజు సీసాలు, రాళ్లు తీసుకొని సముద్రంలోకి వెళ్లారు. ఏ క్షణం ఏం జరుగుతుందో అని స్థానికులు భయందోళనలకు గురవుతున్నారు. ప్రస్తుతం ఇసుకపల్లి సముద్రతీరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న ఇసుకపల్లి కోస్ట్ గార్డు పోలీసులు అప్రమత్తమైయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకొని గొడవకు గల మరింత సమాచారాన్ని తెలుసుకుంటున్నారు కోస్ట్ గార్డు పోలీసులు.