తమిళనాడు రామేశ్వరంలో మత్స్యకారుల ఆందోళన

తమిళనాడు రామేశ్వరంలో మత్స్యకారుల ఆందోళన

తమిళనాడు రామేశ్వరంలో మత్స్యకారులు ఆందోళనకు దిగారు. శ్రీలంక నేవీ అదుపులోకి తీసుకున్న 27మంది తమిళ ఫిషర్ మ్యాన్ లతో పాటు ఐదు బోట్లను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. మత్స్యకారులను విడిపించేందుకు తక్షణమే విదేశాంగ అధికారులు జోక్యం చేసుకోవాలన్నారు. 

అక్టోబర్‌ 14న రామేశ్వరం నుంచి 400కు పైగా బోట్లలో మత్స్యకారులు చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్లారని  తమిళనాడు బోట్‌ మత్స్యకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌జే బోస్‌ తెలిపారు.  శ్రీలంక నావికాదళం 27 మంది రామేశ్వరం మత్స్యకారులతో పాటు 5 బోట్లను తలైమన్నార్ పోర్టుకు తీసుకెళ్లిందన్నారు.

అటు శ్రీలంక నేవీ తీరును నిరసిస్తూ... ఈనెల 18 వరకు పంబన్ బ్రిడ్జి వద్ద నిరసనలు కొనసాగిస్తామని మత్స్యకారులు తెలిపారు. అటు శ్రీలంక సముద్ర జలాల్లో వేట సాగిస్తున్నారనే ఆరోపణలతో 27మంది తమిళ జాలర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈశాన్య ప్రాంతంలోని మన్నార్ తీరం, డెల్ఫ్, కచ్ఛతీవు దీవుల్లో మత్స్యకారులను అరెస్ట్ చేసినట్లు అధికారులు చెప్పారు.